Actress held for forcing daughter into flesh trade

Actress held for forcing daughter into flesh trade, Actress forcing daughter into flesh trade, director held for molesting minor girl, CHENNAI CB-CID police, Tamil actress rajeshwari arrested, tamil director Senthamilarasu arrested, Senthamilarasu forced minor actress to sex, Rajeshwari and Senthamilarasu pushed girl actress into sex trade,

The CB-CID police arrested a Tamil actress in Vadapalani for forcing her 14-year-old daughter, an actress herself, into the sex trade.

మైనర్ కూతుర్ని వ్యభిచారంలోకి దింపిన నటి...

Posted: 02/12/2015 03:48 PM IST
Actress held for forcing daughter into flesh trade

తన కన్నా కూతురు అందులోనూ నిండా పదిహేను ఏళ్లు కూడా నిండని బాలనటిని వ్యభిచారం లోకి దించే ప్రయత్నం చేసిన ఓ నటిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సంఘటన తమిళనాడు లోని వడపళని లో జరిగింది. బాలనటి పరిస్థితిని కనిపెట్టిన ఓ ఎన్జీఓ సంస్థ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సిబీసీఐడీ పోలీసులు తతంగం జరుగుతున్న హోటల్ పై దాడి చేసారు. బాలనటిని విడిపించి.. మైలాపూర్ లోని బాలికల రెస్క్యూ హోంకు తరలించారు. బాలనటి చేత వ్యభిచారం చేయించేందుకు ఒత్తిడి తీసుకువచ్చిన నటి సహా ముగ్గురిని అదుపులోకి తీసకున్నారు.

కూతురును సెక్స్ ట్రేడ్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన నటి రాజేశ్వరి, మైనర్ బాలికకు పెద్ద నటిగా తీర్చిదిద్దుతానని నమ్మబలికి అమెను అనుభవించే ప్రయత్నం చేసిన దర్శకుడు సెంథిమిలరసు, మరో మహిళను సిబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.  రాజేశ్వరి పలు చిత్రాల్లో మంచి పాత్రలే చేసింది. ఆ తరువాత్ సినిమాలు లేకపోవడం తో సంపాదన లేదు. దాంతో జీవితం గడవడం కష్టమై పోయిన నేపద్యం లో తన కూతురిని పెద్ద హీరోయిన్ గా తీర్చదిద్దేందుకు దర్శకులతో ఈ దారుణానికి పాల్పడిందని అరోపణలు వస్తున్నాయి. కూతరితో పాటు తాను స్వయంగా ఈ రోంపిలోకి దిగేందుకు రాజేశ్వరి సిద్దమైయ్యిందని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు

ఓ స్వచ్చంద సంస్థ ద్వారా సమాచారం అందుకున్న సిబిసీఐడీ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ ద్వారా చేధించారు. కస్టమర్లుగా వెళ్లిన పోలీసులు వారిని కలిశారు. ఆ బాలికతో గడపాలంటే రూ.1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు మొదట పదివేల రూపాయలు ఇచ్చారు. మిగిలిన మొత్తం తర్వాత ఇస్తామని చెప్పారు. వారు లోపలకు వెళ్లాక బాలిక మైనర్ అని గుర్తించారు. బయట ఉన్న పోలీసులను అలర్ట్ చేశారు. వెంటనే పోలీసులు లోపలకు వచ్చారు. బాలికను రక్షించి, నిందితులను అరెస్టు చేశారు. బాలికను రెస్క్యూ హోంకు తరలించారు. నిందితులను రిమాండుకు పంపించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flesh trade  actress  arrest  prostitution  

Other Articles