A person didnt like to leave the hospital in china

china news, china hospital, not to leave hospital

a person didnt like to leave the hospital in china : in china a person name chen was not like to leave hospital, he is living in a hospital from 2011. hospital went to court and get orders to vecate the hospital.

ఆస్పత్రి వదలనంటే వదలను..!

Posted: 02/12/2015 04:17 PM IST
A person didnt like to leave the hospital in china

చిన్న జబ్బు చేసినా మందులు ఇవ్వండి ఇంటి దగ్గర వాడతాం అంటూ ఉంటాం.అంతే కానీ ఆస్పత్రిలో చేరడానిక మాత్రం ఇష్టపడం.  కొంత మందికి అసలు ఆస్పత్రిలో వాసనంటేనే పడదు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం నేను ఆస్పత్రి నుండి బయటకు రానంటే రాను అని భీష్మించుకు కూర్చున్నాడు. చివరకు కోర్టులో కేసు వేసి ఆ ఆస్పత్రి యాజమాన్యం అతన్ని తమ హాస్పిటల్ నుండి వెళ్లగొట్టింది. పోలీసులు ఆ వ్యక్తిని తీసుకెళ్లేటపుడు చిన్న పిల్లాడిలా ఏడ్చాడట. ఇంతకీ ఎందుకతను అలా అంటున్నాడో ఎవరికీ తెలియదు. చైనాలో జరిగిన సంఘటన పూర్తి వివరాలతో ఈ కథనం...

చైనాలోని బీజింగ్ జిల్లాలోని మొంటావ్ గ్రామానికి చెందిన చెన్ అనే వ్యక్తి 2011 ఆగష్టులో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దాంతో అతను బీజింగ్ జింగ్మీ గ్రూప్ ఆస్పత్రిలో చేరారు.
నెల రోజుల తర్వాత గాయాలు పూర్తిగా తగ్గాయని తేల్చిన వైద్యులు అతన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు. చెన్ మళ్లీ రెండు నెలల తర్వాత ఎడమ కాలులో నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతని ఎడమకాలి రక్తనాళాల్లో కొన్ని చోట్ల రక్తం గడ్డకట్టుకుపోవడాన్ని గుర్తించారు. దాదాపు మూడు నెలలు వైద్యం అందించిన అక్కడి వైద్యులు అతన్ని పూర్తి ఆరోగ్యంగా మార్చారు. కానీ ఆస్పత్రి నుండి తాను వెళ్లేది లేదని అక్కడే కూర్చున్నాడు. కొన్నాళ్లకు అతను ఆస్పత్రి బిల్లు కూడా కట్టడం మానేశాడు. దాంతో   2012 జూలై నుంచి ఆతనికి వైద్య సేవలను కూడా నిలిపేశారు ఆస్పత్రి సిబ్బంది. అయినా సరే తాను మాత్రం ఆస్పత్రి నుండి కదలేది లేదని కూర్చున్నాడు. చివరకు తన స్వంత కొడుకు పెళ్లికి కూడా వెళ్లలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న  ఆస్పత్రి యాజమాన్యం కోర్టుకు వెళ్లింది. అయితే  చెన్ ఏమైనా మానసిన వ్యాధితో బాధ పడుతున్నారా అన్న సందేహంతో అన్ని రకాల పరీక్షలు నిర్వహించింది. చెన్ అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. మొత్తానికి కోర్టు జోక్యంతో పోలీసులు వచ్చి చెన్ ను బలవంతంగా ఆస్పత్రి నుండి ఇంటికి తరలించారు. పాపం చెన్ మాత్రం చంటి పిల్లాడిలా గుక్కపెట్టి ఏడ్చేశాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china news  china hospital  not to leave hospital  

Other Articles