Honour killing 20 yr old burnt alive in up mathura

honour killing in uttar pradesh, honour killing in mathura, 20 yr old burnt alive in uttar pradesh, 20 yr old burnt alive in mathura, crime against women. violence against women, honour killing, uttar pradesh, mother, daughter, crime, neeraj kumari butnt alive in mathura, Mohar Devi, Pramod, Ajay, accused arrested in honour killing, mathura superindentent Manjil Saini,

In a case of honour killing, a 20-year-old girl was burnt alive by her mother and brother in Amirpur village, police on Thursday said.

కన్న కూతర్ని సజీవ దహనం చేసిన కసాయి తల్లి..

Posted: 02/12/2015 02:07 PM IST
Honour killing 20 yr old burnt alive in up mathura

ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరువు పోతుందనే నెపంతో ఓ కసాయి తల్లి తన కన్నకూతురినే సజీవ దహనం చేసింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధురలోని అమీర్‌పూర్‌ గ్రామానికి చెందిన నీరజ్‌ కుమారి(20) అనే యువతిని ఆమె తల్లి, సోదరుడు దారుణంగా హత్య చేశారు. మృతురాలు ఓ యువకుడిని ఇష్టపడటం.. అది వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు  వారించారు. అయినా ఆ అబ్బాయినే వివాహమాతుతానని నీరజా కుమారీ భీష్మించడంతో.. తమకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించి పెళ్లాడుతానన్న కారణంగా పరువు కోసం నీరజను సజీవ దహనం చేశారు.

మృతురాలి తల్లి మోహర్‌ దేవి, సోదరుడు ప్రమోద్‌, యువతి ప్రేమించిన యువకుడు అజయ్‌లను అదుపులోకి తీసుకొని విచారణ జరపుతున్నట్లు ఎస్‌ఎస్పీ మాంఝీ సైనీ తెలిపారు. అజయ్ కుమార్‌ని నీరజ్ కుమారి ప్రేమించడం ఇష్టంలేదని, అందుకు ఆమెను కాల్చి చంపామని బాధితురాలి తల్లి, సోదరుడు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : honour killing  uttar pradesh  mother  daughter  crime  

Other Articles