హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు బ్రాండ్ అంబాసిడర్ సాయం తీసుకోవాలని, అంతకన్న ముందు నగర ప్రజలతో పాటు విశ్వవాప్తంగా మంచి ఇమేజ్ వున్న వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. డల్లాస్ నగరం కంటే ఘనంగా భాగ్యనగరాన్ని మార్చుతామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, తాజాగా 'హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్'గా ప్రముఖ నటుడు మహేష్ బాబును నియమించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి, బ్రాండ్ వాల్యూ పెంచే అంశంపై కేసీఆర్ దృష్టి పెట్టారు.
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మాణం తదితర అంశాలపై కసరత్తు చేస్తున్న ఆయన హైదరాబాద్‌కు ఓ బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని యోచిస్తున్నారు. ఇప్పటికే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇక అన్నివర్గాల్లో క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే బాగుంటుందని కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన కొంతమంది సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మహేష్ బాబుతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more