Arvind kejriwal seeks pm narendra modi appointment for swearing in for delhi chief minister

arvind kejriwal seeks modi appointment, arvind kejriwal swearing in cermony, arvind kejriwal swearing in on 14, arvind kejriwal delhi chief minister, delhi chief minister aravind kejriwal, aravind kejriwal on job on results next day, arvind kejriwal requests to regularise houses in delhi, arvind kejriwal to meet home minister rajnath singh, arvind kejriwal to meet president pranab mukharjee

arvind kejriwal seeks pm narendra modi appointment for swearing in for delhi chief minister

రేపే ఆ శుభ గడియలు.. కలవనున్న ఇద్దరు నేతలు

Posted: 02/11/2015 11:08 AM IST
Arvind kejriwal seeks pm narendra modi appointment for swearing in for delhi chief minister

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలలో తన హావాను కొనసాగించిన నేత ఒకరు. తాజాగా జరిగిన దేశ రాజధాని నగర ఎన్నికలలో సునామీని సృష్టించిన దీరుడు మరోకరు. ఈ ఇద్దరి నేతల అపూర్వ కలయిక రేపు జరగబోతోంది. గురువారం ఉదయం 10.30లకు అరవింద్ కేజ్రీవాల్ ప్రదాన మంత్రి మోదీని కలవనున్నట్టు ఆప్ తెలిపింది. కేజ్రీవాల్  ఫిబ్రవరి 14న రాంలీలా మైదానంలో ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణస్వీకరా మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్టు ఆప్ పేర్కొంది. ఈ మేరకు ప్రదాని అపాయింట్ మెంట్ కోరగా రేపు లభించినట్లు ఆప్ తెలిపింది.

కాగా, బుధవారం ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా ఢిల్లీలో అనధికార కాలనీల సమస్యలపై చర్చ జరిపినట్లు సమాచారం. సుమారు 60 లక్షల మంది అనధికారిక నివాసాల్లో ఉంటున్నారని, ఆ ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని వెంకయ్యను కోరినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్తో మనీష్ సిసోడియా కూడా వెంకయ్యను కలిసినవారిలో ఉన్నారు. మరోవైపు వెంకయ్యతో కేజ్రీవాల్ మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ఆప్ తెలిపింది. కాగా కేజ్రీవాల్ ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా భేటీ కానున్నారు.
 
.జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  pm narendra modi  venkaiah naidu  

Other Articles