";}ner_id).html(html); }); } }

Tngos decided to work extra hours

tngos, t govt, govt employees, extra hours duty, fitmant

tngos decided to work extra hours :govt. employes decided to work two hours extra. govt recently declare 43 percent fitment to employees.

ప్రభుత్వ ఉద్యోగులు రెండు గంటలు ఎక్కువ పని చేస్తారట

Posted: 02/11/2015 12:03 PM IST
Tngos decided to work extra hours

ప్రభుత్వ కార్యాలయాలే అంటే అలసత్వానికి నిలయాలుగా మారాయి. చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగులు టైమింగ్ ను పాటించరు. లైట్ గా వచ్చి, తొందరగా వెల్లడం ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేకత. గవర్నమెంట్ ఆఫీసులో ఏదైనా పని కోసం వెళుతున్నారంటే కొత్త చెప్పులు కొనుక్కో, అవి అరిగే లోపు నీ పని అవుతుందన్న నానుడి చాలా సార్లు నిజమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇదేంటని ప్రశ్నిస్తే మాత్రం రూల్స్ చెప్పి మరింత ఆలస్యం చేస్తారు.

ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఫిట్ మెంట్ తో గవర్నమెంట్ ఉద్యోగులు కొత్తగా ఓ నిర్ణయం తీసుకున్నారట. ప్రతి రోజు రెండు గంటలు అదనంగా పని చెయ్యాలని తెలంగాణ ఎన్జీవోలు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి చేరేలా సామాజిక బాధ్యత, నిబద్దతతో వ్యవహరించాలని టిఎన్జీవోలు తమ సమావేశంలో నిర్ణయించుకున్నారు. అంతేకాదు నెలలో ఓ ఆదివారం శ్రమదానం చెయ్యాలని తీర్మానించుకున్నారు. పని వేళలను ఏమాత్రం లెక్క చెయ్యలని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఈ నిర్ణయానికి ఎలా న్యాయం చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tngos  t govt  govt employees  extra hours duty  fitmant  

Other Articles