Congress workers demand bringing in priyanka vadra

congress workers demand priyanka, slogans at congress office, bring priyanaka into congress, congress party head quarters, congress duck out in delhi polls, delhi assembly polls 2015, delhi assembly results, delhi assembly winner

Is the Congress headed for a rout in Delhi assembly polls, 'Bring Priyanka' slogans were once again raised outside the the party headquarters here Tuesday.

ఆశా కిరణమా.. రా.. పార్టీని పగ్గాలను చేపట్టు..

Posted: 02/10/2015 02:12 PM IST
Congress workers demand bringing in priyanka vadra

ఘనమైన చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతినింది. 70 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా పొందకుండా డకౌట్ అయ్యింది. ఇక ఘనమైన 120 ఏళ్ల చర్రిత వుందంటూ ఊదరగోట్టే పార్టీ నాయకులు, శ్రేణులు ఇప్పుడు డోలాయమానంలో పడ్డారు. పార్టీలో ఎలా కొనసాగాలన్నది అర్థంకాక.. ఇప్పటికే పార్టీ నుంచి వేరే పార్టీలలో చేరిన తమ వారి అడుగుజాడల్లోనే నడిచేందుకు సిద్దమవుతున్నారు. అయితే పార్టీలోనే వుంటామని తేల్చుకున్న మరికోందరు మాత్రం పార్టీని బతికించుకునే చర్యలకు పూనుకున్నారు. తమ ఘనచరిత్ర.. ఎక్కడ చరిత్ర పుటలకే పరిమితం అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఇందులో భాగంగా మళ్లీ పాత నినాదాన్నే భుజాలపైకి ఎత్తుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నుంచి తరచుగా వస్తున్న కాంగ్రెస్ వాదుల నినాదమే ఇది. రాష్ట్రాల ఫలితాలు వెలువడిన ప్రతీసారి.. కాంగ్రెస్ చరిష్మా పనిచేయలేదన్న, రాహుల్, సోనియాలకు బదులు  ప్రియాంక లావో...కాంగ్రెస్ బచావో అంటూ కాంగ్రెస్ వర్గాల్లో నినాదాలు ప్రారంభమవుతాయి.  ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవకుండా కాంగ్రెస్ ఖతం అయ్యింది. గత ఎన్నికల్లో కనీసం 8 సీట్లైనా సాధించిన కాంగ్రెస్ ఈ సారి అవి కూడా లేవు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ భవితవ్యం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారో.. వేచి చూడాల్సిందే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priyanka gandhi  congress  slogans  

Other Articles