Cab rape accused threatens to thrash reporters

uber cab rape accused, Shiv Kumar Yadav, hreatens to thrash reporters, accused of raping a woman executive, uber cab driver, media, threatens to trash, Dharmender Kumar Mishra

Shiv Kumar Yadav, who is accused of raping a woman executive, accused the media of harbouring a bias against him and also threatened media-persons in a trial court.

రిపోర్టర్లపై దాడి చేస్తానన్న ఉబర్ క్యాబ్ డ్రైవర్

Posted: 02/10/2015 02:15 PM IST
Cab rape accused threatens to thrash reporters

అంతా మీడియానే చేసింది. తనపై అనసరంగా ఏకపక్ష కథనాలను ప్రచురించి తన పరువును బజారున పేడేసింది. ఇది కొందరు నేరగాళ్ల వాదన, నేను అలా అనలేదు మీడియా నా వ్యాఖ్యాలను వక్రీకరించింది.. ఇది మరికోందరు రాజకీయ నేతల వ్యాఖ్యలు.. మీడియా తప్పుగా అర్థం చేసుకుంది, నా వ్యాఖ్యాల సారాంశం అది కాదు.. ఇది మరి కోందరు నేతల వాదన.. ఇలా ఎవరికి వారు తాము ఇబ్బందుల్లో పడినప్పుడల్లా మీడియాపై తప్పును తోసి తప్పించుకోవాలని చూస్తారు. సరిగ్గా ఇలా చేశాడు ఆ అత్యాచార నిందితుడు.

న్యూఢిల్లీలో తన కారులో ఎక్కి నివాసానికి చేరుకోవాల్సిన ఓ సంస్థ ఉద్యోగిని.. అమె ఆదమర్చి నిద్రలోకి జారుకోవడంతో శివార్లలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఉబెర్ టాక్సీ డ్రైవర్, అత్యాచార కేసులో నిందితుడు శివకుమార్ యాదవ్ కూడా మీడియానే తన ప్రతిష్టను దిగజార్చుతుందని అక్రోశాన్ని వెళ్లగక్కాడు. తన పరువుకు నష్టం వాటిల్లేవిధంగా కథనాలు ప్రచారం చేస్తున్న మీడియాపై ఏకంగా కోర్టులోనే అక్రోశాన్ని వెళ్లగక్కాడు. అంతటితో ఆగకుండా కోర్టు అవరణలోనే మీడియా ప్రతినిధులకు హెచ్చరికలు చేశాడు. మీ అంతుచూస్తాను జాగ్రత్తా అంటూ తన అక్రోశ్నాన్ని వెల్లగక్కాడు.

తన కేసును అంతకు ముందున్న న్యాయవాది అలోక్ ద్వివేది సరిగా వాదించడం లేదన్న కారణం చేత మరోమారు తన న్యాయవాదిని మార్చుకున్నాడు శివకుమార్ యాదవ్. తన తరపున వాదనలను సరిగా వినిపించని కారణంగా న్యాయవాదిని మార్చుకునేందుకు అనుమతించాలని ఆయన పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. నిందితుడు ప్రస్తుతం ధర్మేంద్ర కుమార్ మిశ్రా అనే న్యాయవాదిని నియమించుకున్నారు. అయితే న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి వాదనలు వినిపించేందుకు తనకు వారం రోజుల వ్యవధి కావాలని న్యాయవాది ధర్మేంద్ర కుమార్ మిశ్రా న్యాయస్థానాన్ని కోరారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uber cab driver  media  threatens to trash  

Other Articles