Two words shivasena secular socialistic

shivaseva, constitution, secular, socialistic, amendement, venkayya naidu

two words shivasena secular socialistic : shiva sena oppose the two words in the constitution. to delete the words decular and socialistic

ఆ రెండు పదాలు....రాజ్యాంగంలో ఉండాలా? వద్దా?

Posted: 02/07/2015 03:25 PM IST
Two words shivasena secular socialistic

'సెక్యులర్, సోషియలిస్టిక్ అనే రెండు పదాలపై శివసేన చేసిన అభ్యంతరాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజానికి ఆ రెండు పదాలు రాజ్యాంగం ప్రవేశపెట్టినపుడు లేవు అన్నది వాస్తవం. కానీ ఇందిరా గాంధీ హయాంలో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండు పదాలను చేర్చారు. దీనిపైనే శివసేన తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగంలో వాటి అవసరం లేదని అందుకే వాటిని తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. బిజెపి పార్టీ మిత్రపక్షం కనుక శివసేన ప్రతి వ్యాఖ్య బిజెపిని ఇరుకున పెట్టేస్తుంది. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వాటిని చేర్చారని, రాజ్యాంగ పరిషత్ వాటిని చేర్చాలని అనుకోలేదు కాబట్టే రాజ్యాంగంలో పొందుపర్చలేదని వారి వాదన.

ఇక రాజ్యాంగంలో చేర్చిన ప్రతి పదం, అంశం ఎంతో ముఖ్యమైంది. ఎంతగా అంటే ఒక్క పదం దేశం మొత్తం జనాభాపై ప్రభావాన్ని చూపుతుంది. మరి అలాంటిది రెండు పదాలను రాజ్యాంగం నుండి తొలగించాలంటే ఎంతో ఆలోచించాల్సిందే. లౌకికవాదం అనేది రాజ్యాంగబద్ధం కనుక లౌకికవాదం ఆధారంగా ప్రభుత్వాన్ని తొలగిస్తే అంగీకరిస్తామని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే రాజ్యాంగ పీఠికలోని లౌకికత్వానికి ఉన్న ప్రాధాన్యత తెలియచేస్తుంది. లౌకికం, సోషలిస్టు అనే పదాలను 1976లో చేర్చారు. అయినా ఎస్.ఆర్.బొమ్మై కేసు తరువాత వచ్చిన అనేక కేసుల్లో లౌకికవాదం, సామ్యవాదం రెండూ రాజ్యాంగ పీఠికలో భాగం. మొత్తానికి లౌకిక, సామ్యవాద అనేవి పదాలు మాత్రమే కాదు అన్నది వాస్తవం. ఈ వివాదంపై వెంకయ్య నాయుడు సవివరణ ఇచ్చారు 1976 కు ముందు లౌకిక, సామ్యవాద అనే పదాలు లేకపోయినా భారత్ లో రెండు పదాల లక్షణాలు కనిపించాయని వివరించారు. శివసేన ఎలాంటి కారణాలు లేకుండా లేనివివాదాలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : secular  socialistic  shivesena  constitution  

Other Articles