London doctors examined conjoined twins veena vani

Conjoined twins Veena and Vani, London doctors, Great Ormond Street Hospital, surgery to separate Veena and Vani, twins were earlier thrice examined, UK doctors, Dr David Dunaway, Dr Owase Jeelani, DR.Ramesh Reddy, Niloufer Hospital, Telangana government, Murali Nagalakshmi,

Conjoined twins Veena and Vani had been examined by doctors from the Great Ormond Street Hospital, London, on Saturday.

వీణా వాణీలు విడిపోతున్నారా..? ప్రభుత్వం సాయం..?

Posted: 02/07/2015 01:30 PM IST
London doctors examined conjoined twins veena vani

అవిభక్త కవలలు వీణా-వాణిల శస్త్రచికిత్సపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే వారు విడిపోతున్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సాయం చేయనుంది. ఎంతో సంక్షిష్టమైన ఈ చికిత్స చేపట్టేందుకు తాజాగా లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆస్పత్రి గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ వైద్యులు డాక్టర్ డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీలతో కూడిన వైద్య బృందం ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ బృందం మెదళ్లు కలిసి పుట్టిన ఏడాది వయసున్న కవలలను విజయవంతంగా వేరు చేసింది. ఇదే విధానంలో ప్రస్తుతం వీణా-వాణిలను కూడా వేరు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

నిలోఫర్ వైద్యుల అభ్యర్థన మేరకు ఆ బృందం హైదరాబాద్ కు వచ్చింది. నీలోఫర్ వైద్యుడు రమేశ్ తో లండన్ వైద్యులు చర్చలు చేపట్టారు. శస్త్రచికిత్సకు వున్న అవకాశాలను వైద్యులు అడిగి తెలుసుకుంటున్నారు. పిల్లలను పరీక్షించి అవసరమైతే లండన్‌కు తీసుకువెళ్లి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆపరేషన్ విజయవంతమైతే దాదాపు 12 ఏళ్లుగా అనుభవిస్తున్న నరకయాతన నుంచి ఆ చిన్నారులకు విముక్తి దొరికినట్లే.

ఈ చిన్నారులకు సాయం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కేవలం వైద్య పరీక్షలతో సరిపెట్టకుండా శస్త్రచికిత్స చేయించి వారికి విముక్తి కల్పించాలని కవలల తల్లిదండ్రులు మారగాని మురళి, నాగలక్ష్మి వేడుకున్నారు. వారు శుక్రవారం తమ సొంతవూరిలో మాట్లాడుతూ లండన్ వైద్యులు ఎలాగైనా తమ పిల్లలకు శస్త్రచికిత్స చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

గతంలోనూ వీణా వాణీలను విడదీసేందుకు పలు ప్రయత్నాలు జరిగాయి. గుంటూరుకు చెందిన ప్రముఖ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ నాయుడమ్మ వారికి అపరేషన్ చేసేందుకు చర్యలు తీసుకునే లోపు ఆయన పదవీ విరమణ చేశారు. ఆ తరువాత 2007లో ముంబయికి చెందిన బ్రీచ్‌కాండి ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చినా..సంక్షిష్టం కావడంతో వెనుకాడారు. 2009లో సింగపూర్‌కు చెందిన కీత్‌గో బృందం పరీక్షలు చేసింది. అయితేఅక్కడ చికిత్సకు ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేయడంతో నిలిచిపోయింది. కాగా ఇదే తరహా శస్త్ర చికత్సను విజయవంతంగా పూర్తి చేసిన లండన్ వైద్యుల ఆగమనంతో అక్కచెల్లళ్లలో నూతన ఆశలు నెలకొన్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Conjoined twins  UK doctors  Niloufer Hospital  

Other Articles