అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు న్యూఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలం విమానాశ్రయానికి చేరుకుని, ఒబామా దంపతులకు విమానం వద్దే స్వాగతం పలికారు. ఒబామా దంపతులు ఉపయోగించే ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకురావడంతో.. దాని సమీపంలోనే స్వాగత కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్ధేశిత సమయం కన్నా సుమారు అరగంట ముందుగానే ఒబామా దంపతులు భారత్ చేరుకున్నారు.
ముందుగా ఒబామాకు పాశ్యాత స్టైల్ లో షేక్ హ్యాండ్ ఇచ్చిన నరేంద్రమోదీ.. ఆ తర్వాత ఆయనను బలంగా భారత సంప్రదాయం ప్రకారం ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిషెల్ ఒబామా కూడా మోదీతో చేతులు కలిపారు. అనంతరం ఒబామా, మోదీ, మిషెల్ ముగ్గురూ చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, అక్కడి నుంచి ఒబామా దంపతులకు బస ఏర్పాటు చేసిన ఐటీసీ మౌర్య హోటల్ కు వారు చేరుకున్నారు. కాగా హోటల్ వద్ద కనీ వినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 మీటర్లకు ఒకటి చొప్పున హాలోజన్ దీపాలను ఏర్పాటుచేశారు. అక్కడకు సమీపంలో ఉన్న తాజ్ హోటల్ను కూడా భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బబామా పర్యటన సందర్భంగా ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు దళానికి చెందిన ప్రత్యేక స్నిఫర్ డాగ్ స్క్వాడ్ను రప్పించారు. సమీపంలో ఉన్న తాజ్ హోటల్ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more