Grand welcome to barrack obama in rashtrapati bhavan

obama modi visit 2015, barrack obama, america president barrack obama, palam airport, narendra modi, prime minister modi, red carpet welcome, india welcomed obama, michelle obama, american first lady michelle obama, modi hugs obama, obama shake hands modi, president pranab mukharjee, rashtrapati bhavan,

american president barrack obama gets grand welcome in rashtrapati bhavan

ఒబామాకు సాదరస్వాగతం.. త్రివిధ దళాల వందనం

Posted: 01/25/2015 02:56 PM IST
Grand welcome to barrack obama in rashtrapati bhavan

భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా ప్రథమ పౌరుడు బరాక్ ఒబామాకు రాష్ట్రపతి భవన్లో సాదర స్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒబామాను స్వాగతించారు. రాష్ట్రపతి భవన్లోని ఫోర్కోర్ట్ ప్రాంతంలో రెడ్ కార్పెట్ పరిచి రాష్ట్రపతి భవన్లో ఒబామాను స్వాగతించారు. ఆయనకు పూర్తిస్థాయి సైనిక గౌరవవందనం లభించింది. తుపాకులను 21 రౌండ్లు గాల్లోకి పేల్చి.. రిపబ్లిక్ డే అతిథికి స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ ప్రధాన గేటు వద్ద నుంచి అశ్వికదళం తోడు రాగా ఒబామా ప్రయాణిస్తున్న 'ద బీస్ట్' వాహనం నెమ్మదిగా లోపలకు వచ్చింది.

తొలుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్వాగతించారు. అక్కడి నుంచి సైనిక వందనం స్వీకరించే వేదిక వద్దకు ఒబామా చేరుకున్నారు. త్రివిధ దళాధిపతులు కూడా రాష్ట్రపతి భనవ్ వద్ద ఒబామాకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు మనోహర్ పారిక్కర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రపతి భవన్ లో ఒబామాతో కఃరాచలనం చేశారు.

మహిళా అధికారికి దక్కిన అరుదైన అవకాశం

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించే అరుదైన అవకాశం ఏకైక మహిళా సైనికాధికారిణి వింగ్ కమాండర్ పూజా ఠాకూర్.. దక్కింది. రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడికి సలామే శస్త్ర్ నుంచి.. ఆయనను సైనిక వందనానికి తోడ్కొని తీసుకెళ్లే అవకాశం దక్కింది. ఇరు దేశాల జాతీయగీతాల ఆలాపన పూర్తయిన తర్వాత ముందుగా రాష్ట్రపతి, ప్రధాని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులతో ఒబామా కరచాలనం చేశారు. ఆ తర్వాత అమెరికా అధికారులు, మంత్రులు, ఇతరులతో కూడిన బృందాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఒబామా పరిచయం చేశారు. అనంతరం ఆయన మళ్లీ తన 'బీస్ట్' వాహనం ఎక్కి.. రాజ్ఘాట్కు బయల్దేరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama modi visit 2015  narendra modi  grand welcome  pranab mukharjee  

Other Articles