Not a single rupee has been brought back in the last six months

Ram Jethmalani, Black money, Supreme Court of India, Black money laws, Black money legislation, Black money in India, legislation on Black money, SIT on Black money, UPA government, NDA government, Rupee, Ram Jethmalani, Prashant Bhushan, Madan B Lokur, Anil Divan

Senior advocate Ram Jethmalani expressed his disappointment over delays in introducing a black money law that he had mooted and the government's failure to get back funds illegally stashed overseas during a hearing on the matter in the Supreme Court

7 నెలలైనా ఒక్క పైసా నల్లధనం కూడా వెనక్కి రాలేదు..

Posted: 01/21/2015 11:53 AM IST
Not a single rupee has been brought back in the last six months

భారత నల్లధన కుబేరుల జాబితాను ప్రకటించడం కన్నా.. నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడమే ప్రధానమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాపడిన నేపథ్యంలో చట్టాలను సవరించడంతోనే నల్లధనాన్ని వెనక్కుతీసుకురాగలమని ప్రముఖ న్యాయవాది రాంజఠ్మలానీ అన్నారు. విదేశాలలో మూలుగుతున్న నల్లధనం, దానిని వెనక్కు రప్పించే అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసిన రాంజఠ్మాలానీ.. గత యూపీఏ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంలో ఆయన ప్రస్తుతం కేంద్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికల వేళ ప్రజలకు 100 రోజుల్లో భారత నల్లధన కుబేరులకు చెందిన ధనాన్ని వెనక్కు తీసుకవస్తామని చెప్పిన బీజేపి.. అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు కావస్తున్నా.. ఇప్పటికీ నల్లధనం తీసుకురావడంలో విఫలమైందని ఆయన సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని వ్యక్త పర్చారు. ఇప్పటి వరకు ఒక్క పైసా నల్లధనాన్ని కూడా మోడీ ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని తన అవేదనను వ్యక్తం చేశారు. తాను తన డబ్బుకోసం అగడం లేదని, విదేశాలలో మూలుగుతున్న భారత జాతి సోమ్మును వెనక్కు తీసుకురమ్మని కోరుతున్నానని జస్టిస్ హెచ్ ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ముందు తన వాదనను బలంగా వినిపించారు.

ప్రస్తుతం వున్న పాత చట్టాల స్థానాలలో నూతన చట్టాలను తీసుకువచ్చి నల్లధనాన్ని వెనక్కు తీసుకురావాలని ఆయన కోర్టుకు తెలిపారు. లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణల చేసి నలధనాన్ని తీసుకురావాలని రాంజఠ్మలాని కోరారు. అలా మార్పులు చేర్పులు చేయనంత కాలం నల్లధనం అంశంలో ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు. నల్లధనం వెనక్కు తీసుకువచ్చే అంశంలో ఆచరించాల్సిన విధానాలతో ఒక ప్రతిపాదనను ఆయన కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అందించారు. అయితే ఈ అంశాలను పరిశీలించాల్సిందిగా ప్రధాని మోడీ ఆర్థిక మంత్రిత్వ శాఖను అదేశించినా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రాంజఠ్మలానీ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Jethmalani  Black money  Supreme Court of India  

Other Articles