Former mp son hulchul in panjagutta

former mp son hulchul, former mp son arrested, former mp son alcoholic intoxication, former mp son attacked hotel staff, former mp son attacked police, former mp son hulchul in panjagutta, former mp son and his friends arrested,

former mp son attacked on hotel staff and police in alcohol intoxication

ITEMVIDEOS: మద్యం మత్తులో మాజీ ఎంపీ కుమారుడి హల్ చల్..!

Posted: 01/21/2015 09:41 AM IST
Former mp son hulchul in panjagutta

అతని తండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాడనో.. ఏమో.. ఆయన పుత్ర రత్నం చట్టం తన చుట్టమనుకున్నట్లు వ్యవహరించాడు. ఉన్నత స్థాయికి చెందిన తన తండ్రి ఆశయాలను కాదని.. చిన్న విషయంలో వాగ్వాధానికి దిగి, నానా హంగామా చేశాడు. మద్యం మత్తులో మాజీ ఎంపీ కుమారుడు హల్ చల్ చేశాడు. అడ్డుకోబోయిన పోలీసులను ధిక్కంరించి వారిపై కూడా తిరగబడట్టు సమాచారం. దీంతో మరికొందరు పోలీసులు అక్కడి వచ్చి వారిని అదుపులోకి తీసుకుని రాత్రంతా స్టేషన్ లోనే విచారించారు.

నగరంలోని పంజాగుట్ట పోలిస్ స్టేషన్ పరిధిలోకి ఒక ప్రముఖ హోటల్ కు చేరుకున్న మాజీ ఎంపీ కుమారుడికి.. హోటల్ సిబ్బందికి మధ్య మీల్స్ పార్శిల్ విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే అప్పటికే మద్యం మత్తులో వున్న ఆయన సీసాలతో అక్కడి హోటల్ సిబ్బందిపై దాడికి యత్నించినట్టు సమాచారం. దాంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కూడా తిరగబడేందుకు యత్నించాడు. దాంతో అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alcohol intoxication  Former MP Son  police attack  

Other Articles