Pk is plagiarism of a novel

pk movie news, pk movie controversies, aamir khan pk movie updates, aamir khan pk movie plagiarism, pk movie plagiarism, pk movie star cast, anushka sharma news, delhi high court news, aamir khan cases, pk movie cases, pk movie petitions, pk movie copied, pk movie novel, pk movie delhi high court, rajkumar hirani news, sushant singh rajput news

Filing a petition in Delhi High Court, a writer has alleged that the story of blockbuster "PK" is copied from his novel. Accusing plagiarism, the writer has demanded a crore in compensation from producers and script writer of the film.

మరో వివాదంలో చిక్కుకున్నఅమీర్ ఖాన్ ‘పీకే’

Posted: 01/21/2015 12:45 PM IST
Pk is plagiarism of a novel

విడుదలకు ముందునుంచి వెంటాడుతున్న బాలారిష్టాలను దాటుకుని.. విడుదలై నాటి నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నా.. మునుపెన్నడూ లేనంతంగా కలెక్షన్లు రాబడుతూ 600 కోట్ల రూపాయల క్లబ్ లో చేరి మరింత ముందుకు పరుగులు తీస్తున్న బాలివుడ్ చిత్రం పీకే మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రధర్శిస్తున్న పలు థియేటర్ల వద్ద అందోళనలు, విధ్వంస రచనలు జరిగినా.. కలెక్షన్ల సునామీతో ఘన విజయం సాధించింది ఈ చిత్రం. అమీర్ ఖాన్ హీరోగా, అనుష్క శర్మ హీరోయిన్ గా నటించారు.

తాజాగా ఈ చిత్రం దర్శక నిర్మాత రాజ్ కుమార్ హిరాని, సహ నిర్మాత విదు వినోధ్ చోప్రా, సినిమా కథ రచయిత అభిజాత్ జోషిలపై ఓ నవలా రచయిత ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. తాను 2013లో రచించిన ‘ఫరిష్టా’ నవల నుంచి పలు సన్నివేశాలను తస్కరించి సినిమాలో పొందుపర్చారని నవలా రచయిత కపిల్ ఇసాపురి అరోపించారు. ఈ మేరకు ఆయన తన తరపు న్యాయవాది జ్యోతికా కర్లాతో ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. తన నవల నుంచి సుమారుగా 17 సన్నివేశాలను సినిమా కోసం వినియోగించుకున్నారని నవలా రచయిత ఆరోపించారు

పలు సన్నివేశాలను యథాతథంగా, మరికోన్ని సన్నివేశాలకు చిన్న చిన్న మార్పలు చేసి సినిమాలో వినియోగించుకున్నారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా కథను చౌర్యం చేసిన సినిమాలో పొందుపర్చినందుకు గాను తనకు కోటి రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పించాలంటూ కపిల్ ఇసాపురి న్యాయస్థానాన్ని అర్థిస్తూ పిటీషన్ దాఖలు చేశారు. అయితే కపిల్ ఇసాపురి చెప్పే విషయాలను పలువురి సినిమా అభిమానులకు విస్మయానికి గురిచేస్తున్నాయి. కపిల్ ఇసాపురి తన పుప్తకాన్ని ప్రచురించేందుకు ముందునుంచే పీకే చిత్రం షూటింగ్ సన్నాహాలకు వెళ్లిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా దర్శక నిర్మాతలతో పాటు కథా రచయితలు న్యాయస్థానానికి ఏమి చేబెతారో వేచి చేడాల్సిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PK  delhi high court  kapil isapuri  

Other Articles