Si ramulu deid in kallu compound

si ramulu found dead, si ramuli deid in kallu compound, cyberabad comissionerate, rayadurgam ps, SI ramulu, rayadurgam toddy shop, si ramulus suspisious death, ci srikanth,

suspicious death of cyberabad commissionerate SI Ramulu in toddy compond

కల్లుపాకలో ఎస్ఐ మృతి..? కల్తీయే కారణమా..?

Posted: 01/21/2015 08:50 AM IST
Si ramulu deid in kallu compound

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాయదుర్గంలోని కల్లుపాకలో ఎస్‌ఐ మృతిచెందాడు. సైబరాబాద్ కమీషనరేట్ కు కూత వేటు దూరంలోని రాయదుర్గం పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గం సీఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలం బొట్లగడ్డ తండాకు చెందిన వి.రాములు(53) సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు.రాజేంద్రనగర్ బుద్వేల్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న రాములు యధావిధిగా కార్యాలయానికి వెళ్లాడు.

10 గంటలకు అనుమతి తీసుకొని బయటకు వచ్చాడు. మధ్యాహ్నం రాయదుర్గం కల్లు కాంపౌండ్ ముందు ఓ వ్యక్తి చనిపోయాడని స్థానికులు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతిచెందిన వ్యక్తి ఎస్‌ఐ రాములుగా గుర్తించారు. అధికారులకు సమాచారం అందించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రాములుకు భార్య, కుమార్తె ఉన్నారు. కల్లు కాంపౌండ్ బయట రాములు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తుండగా.. స్థానికులు మాత్రం రాములు కాంపౌండ్‌లోనే చనిపోయాడని అంటున్నారు. కల్లు తాగుతూ నేలకొరిగాడని.. అది గమనించిన కాంపౌండ్ సిబ్బంది రాములును బయట వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

కాగా ఎస్ ఐ రాములు మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. సహజ పానీయం అయిన కల్లును రాములు సేవించేవాడని, ఈ క్రమంలోనే ఆయన కల్లు కాంపాండ్ కు వెళ్లి కల్తీ కల్లు తాగి మృతి చెందాడని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కల్లులో మోతాదుకు మించి మత్తు మందు కలపడంతోనే రాములు మరణించాడని స్థానికులు అరోపిస్తున్నారు. కాగా పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఈ మృతిలో నిజానిజాలు వెల్లడవుతాయని పోలీసులు అంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cyberabad comissionerate  rayadurgam ps  SI ramulu  

Other Articles