Ec issues arvind kejriwal another notice for bribe speech

Election Commission showcause notice, showcause notice to aravind kejriwal, EC second show cause notice, second motice to kejriwal, prima facie, violation of the poll code, kejriwal says take BJP, Congress bribes, kejriwal appeals to vote for aap

The Election Commission (EC) on Tuesday issued a showcause notice, the second in last three days, to Aam Aadmi Party (AAP) chief Arvind Kejriwal for "prima facie" violation of the poll code by allegedly making a speech where he asked voters to take bribes from BJP and Congress but only vote for his party.

ఎన్నికల రణరంగం.. కేజ్రీవాల్ నోరు తెచ్చిన తంటా..

Posted: 01/20/2015 10:32 PM IST
Ec issues arvind kejriwal another notice for bribe speech

ఆమ్ ఆద్మీ పార్టీ అద్యక్షుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ఇబ్బందులకు గురయ్యాడు. ఎన్నికల రణరంగంలో గెలుపుకోసం పరుగులెడుతూ.. తడబటుకు గురవుతున్నారు. దీంతో ఎలాగైనా గెలవాలన్న కోరికతో ఇష్టానుసారంగా చేస్తున్న ప్రకటనలు ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో మూడు రోజుల క్రితమే ఎన్నికల సంఘం నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న ఆయన.. తాజాగా మరో షోకాజ్ నోటీసును అందుకున్నారు. దీంతో మూడు రోజుల్లోనే రెండు షోకాజ్ నోటీసులు అందుకున్న నేతగా మారి.. ఇబ్బందులను ఎదుర్కోనున్నారు.

తాజాగా, ఈ నెల 18న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యాలు ఆయనను షోకాజ్ నోటీసు అందుకునేలా చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం ఆప్‌కే వేయాలంటూ ఢిల్లీ ఓటర్లకు సలహా ఇచ్చిన కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనకు నోటీసు పంపింది. ఈ నెల 22 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Election Commission  Delhi Assembly elections  

Other Articles