Kid fined rs 1500 for not attending birthday party

5-year-old fined, Alex Nash, Derek Nash, Party No Show" invoice for £15.95 (about $24), birthday invoice, Plymouth Ski Slope and Snowboard Centre, Julie Lawrence, mother of birthday boy, legal action on 5 year old,

A 5-year-old is being asked by a friend's mother to pay a "no show" fee for missing her son's birthday party in December, according to British news reports.

పార్టీకి వెళ్లకపోతే.. ఫైన్ కట్టాల్సిందే..

Posted: 01/20/2015 10:09 PM IST
Kid fined rs 1500 for not attending birthday party

పుట్టినరోజు పార్టీలకు ఆహ్వానాలు అందడం సాధారణంగా జరిగుతుంది. అయితే పిలిచిన ప్రతీ ఆహ్వానానికి వెళ్లనూ లేము. కుదిరితే వెళ్తాం.. లేకపోతే లేదు. ఇక పలు సందర్బాల్లో కొందరిని తప్పని సరి పరిస్థితుల్లో కూడా ఆహ్వానాలు పలకాల్సి వస్తుంది. అయితే అలాంటి వారు తమ పార్టీలకు రాకపోతే సంతోషిస్తాం.. అదే అదనుగా చేసుకుని దెప్పి పోడుస్తుంటాం కూడా. కానీ, తన కొడుకు పుట్టినరోజు పార్టీకి పిలిస్తే రానందుకు ఓ కన్నతల్లికి చిరెత్తుకోచ్చింది. ఆహ్వానించినా కార్యక్రమానికి రానందుకు జరిమానా విధించింది. అంతేకాదు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని బెదిరించింది.

లండన్లో జరిగిన ఈ చిత్రమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి... క్రిస్మస్కు కొద్దిరోజుల ముందు జరిగిన పార్టీకి అలెక్స్ నాష్ అనే కుర్రాడిని పిలిచారు. అయితే, అతడు ఆ పార్టీకి వెళ్లలేదు. దాంతో పార్టీకి పిలిచిన పిల్లాడి తల్లి జూలీ లారెన్స్కు బోలెడంత కోపం వచ్చింది. పార్టీకి రాకపోతే ముందుగానే సమాచారాన్ని తెలియజేయాల్సింది పోయి.. ఏ మాత్రం సమాచారం లేకుండా తన కుమారుడి జన్మదిన వేడుకకు గైర్హజారు కాపడంపై కన్నెర్ర చేసింది. అలెక్స్ నాష్ రాకపోవడం వల్ల తనకు అనవసరంగా బోల్డంత ఖర్చయిందని.. పార్టీకి రానందుకు అతడి కోసం తాము ఖర్చుచేసిన రూ. 1500 జరిమానాగా చెల్లించాలని చెప్పింది.

అంతటితో ఆగకుండా. కుర్రాడిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించింది. అయితే జరిమానాను అందుకున్న కుర్రాడి తండ్రి మాత్రం ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. అంతేకాని డబ్బు చెల్లించేది లేదని అలెక్స్ తండ్రి చెప్పారు. వాస్తవానికి ఆ సమయంలో అలెక్స్ తన నాయనమ్మ, తాతయ్యలతో గడపాల్సి వచ్చిందని.. అందుకే ఆ పార్టీకి వెళ్లలేదని అంటున్నారు. ఆ విషయాన్ని చెబుదామంటే లారెన్స్ ఫోన్ నెంబర్ తమ వద్ద లేదన్నారు. అయినా పార్టీకి రాకపోతే జరిమానా విధించడమేంటని ఆయన ప్రశ్నించాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : birthday-party  kid-fined  Alex Nash  

Other Articles