Everest conqueror shunned village

everest conqueror shunned village, Rahul Yelange, Bhogaon Budruk village, Raigad district, climbed Mount Everest, Pune’s first civilian on Mt everst, world’s tallest mountain, shunned from village, Mrs Rahul Yelange, jeans pant, Rahul Yelange expulsed from village, Maharastra

Rahul Yelange of Bhogaon Budruk village in Raigad district had climbed Mount Everest in May 2012 as part of Pune’s first civilian expedition to the world’s tallest mountain.

జీన్స్ ఫాంటు తంటాతో ఎవరెస్టు అధిరోహకుడి గ్రామబహిష్కరణ

Posted: 01/17/2015 08:32 PM IST
Everest conqueror shunned village

అతను అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును ఎక్కాడు. కానీ సొంత గ్రామస్తుల ముందు మాత్రం ఓడిపోయాడు. ఓ వైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం దూసుకుపోతుంటే.. మరోవైపు సాంఘిక దురాచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఇందుకు మహారాష్ట్రలోని ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. సమున్నత ఆశయంతో సొంత ఊరికి చేరుకున్న ఓ యువకుడిని ఆదరించాల్సిన గ్రామస్తులు ఆంక్షలు పెట్టారు.. వినకపోవడంతో గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు.

వివరాల్లోకి వెళితే... రాయ్‌గఢ్ జిల్లాలోని భోగావ్‌బద్రుక్ గ్రామానికి చెందిన రాహుల్ యెలంగె 2012లో ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఆ గ్రామానికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాడు. గత మార్చిలో పూర్ణిమ అనే యువతిని పెళ్లి చేసుకున్న రాహుల్.. ఇటీవలె సొంతూరికి వెళ్లి పాడి పరిశ్రమ పెట్టాలని, అదే సమయంలో గ్రామంలోని చిన్నారులకు పర్వతారోహణలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా భార్యతో కలిసి గ్రామానికి వెళ్లాడు.

నగర వాతావరణంలో పెరిగిన పూర్ణిమ గ్రామంలోనూ జీన్స్, టీషర్టు వేసుకోవడంపై గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీర కట్టుకోవాలని చేసిన ఆజ్ఞలను ధిక్కరించడంతో రాహుల్ కుటుంబంపై రెండు నెలల క్రితం గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. అతడితో మాట్లాడటం మానేశారు. అంతేగాక అతడి గేదలను గ్రామ చెరువులో నీళ్లు తాగడానికి కూడా అనుమతించలేదు. దీంతో పక్క ఊరి నుంచి తాగడానికి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, ఇటీవల వారి పశువుల పాక కాలిపోయింది. దీంతో ఎక్కడ రాహుల్ తమపై ఫిర్యాదు చేస్తాడోనని భయపడిన గ్రామస్థులు ఈ విషయంలో తమకేమీ సంబంధంలేదని ముందుగానే గ్రామపంచాయతీకి లేఖలు ఇచ్చారు. విషయం వెలుగుచూడటంతో అధికారులు గ్రామానికి చేరుకుని సమస్యను పరిష్కరించారు. కాగా, గ్రామంలో అంతకుముందే 22 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేశారని తెలుసుకున్న అధికారులు నివ్వెరపోయారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharashtra  raigad  jeans  wife  expulsion  village  

Other Articles