Petrol prices hiked in telangana

Petrol prices hiked in Telangana, vat on petroleum products, Telangana government imposes vat, state government imposes vat on petrol, government imposes vat on diessel, petrol, dissel, pertoleum products, VAT, Telegana Govenment

petrol prices hiked in Telangana, as government imposed value added serice on petroleum products,

తెలంగాణాలో పెరిగిన ఇంధన ధరలు, సిలబస్‌లో మార్పులు

Posted: 01/17/2015 08:25 PM IST
Petrol prices hiked in telangana

తెలంగాణలో ఇంధన ధరలు పెరిగాయి. అదేంటి ఇంధన ధరలను పెంచేలన్నా, తగ్గించాలన్నా అది కేంద్ర ప్రభుత్వం, ఇంధన సంస్థల చేతుల్లో వుంటుంది కదా..? అదీ కాక నిన్ననే ఇంధన ధరలు తగ్గించామని చమురు సంస్థలు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే.. ఇంధన ధరలు పెరిగాయేంటని అనుకుంటున్నారా..? అవునండీ కేవలం తెలంగాణాలో మాత్రమే ఇంధన ధరలు పెరిగాయి.

అంతర్జాతీయంగా ఇంధన ధరల తగ్గింపుతో అటు కేంద్రం పన్నును విధిస్తూ.. ఇప్పటికే ఇంధన ధరలు అధికంగా వున్నాయన్న తరుణంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వ కూడా వ్యాట్ ను పెంచింది. గత ఆరు మాసాలుగా పది సార్లు తగ్గిన ఇంధన ధరలతో క్రమంగా రాష్ట్రాదాయం సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర తగ్గింది. దీంతో ఇంధన ధరలపై వ్యాట్ పెంచి ఆదాయాన్ని సమకూర్చుకునేందకు తెలంగాణ నిర్ణయిందింది. దీంతో తెలంగాణలో తగ్గిన ఇంధన ధరలతో వాహనదారుల సంతోషాం ఒక్క రోజులోనే అవిరైంది.

ఇక మరోవైపు తెలంగాణలోని ఎస్ ఎస్ సీ సిలబస్‌లో పెద్ద మార్పులు ఉండబోవని టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగమూర్తి తెలిపారు. హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో శనివారం సిలబస్ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం కమిటీ సభ్యుడు లింగమూర్తి మీడియాతో మాట్లాడారు. పరీక్షల్లో మార్పులపై విద్యార్థుల నుంచి వినతులు అందాయని, ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర యువతకు గతంలో అన్యాయం జరిగిందని, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  dissel  pertoleum products  VAT  Telegana Govenment  

Other Articles