Another isis threat scribbled at mumbai airport loo

Mumbai Airport, isis, Another ISIS Threat Scribbled, ISIS Threat Scribbled at Mumbai Airport, staff found two more messages, warning of an ISIS attack, scribbled in mumbai airport men's washrooms, terrorist strike, terror threat, terrorists entered in mumbai airport, mumbai airport security, chatrapati shivaji international airport, us president barack obama, republic day celebrations, cheif guest

Just days after the first such threat did not translate into an attack, ground handling staff found two more messages warning of an ISIS attack scribbled in the men's washrooms of the airport yesterday.

ముంబాయి విమానాశ్రయంలో ఉగ్ర రాతలు.. దాడిచేస్తామని హచ్చరికలు

Posted: 01/16/2015 02:54 PM IST
Another isis threat scribbled at mumbai airport loo

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలను చేస్తున్న తరుణంలో మరోమారు దాడులు తప్పవన్న ఉగ్రవాద హెచ్చరికలు వెలువడ్డాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనవరి 26న దాడులకు తెగబడతామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మరోసారి హెచ్చరించింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ  విమానాశ్రయంపై దాడి చేస్తామని ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఈ మేరకు  ముంబయి ఎయిర్పోర్టులోని స్నానాల గదిలో ఈ లేఖలు కనిపించాయి. రిపబ్లిక్ డే రోజు దాడులు చేస్తామని ఐఎస్ఎస్ లేఖల్లో ఆ సంస్థ పేర్కొంది.
 
దాంతో అప్రమత్తమైన విమానాశ్రయంలో అధికారులు గట్టి  భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు ఈ సమాచారంపై కేంద్ర హోంశాఖ ...పోలీసు శాఖను ఎలర్ట్ చేసింది. ఈ నెల 10న దాడి చేస్తామని ...ఇదే తరహాలో ఏడో తేదీన వాష్ రూమ్ లో రాతలు కనిపించిన తరువాత విమానాశ్రయంలో భద్రతను పటిష్టం చేశారు. అయినా మళ్లీ ఉగ్రవాద రాతలు కనబడటంతో విమానాశ్రయంలోని భద్రత డోల్లతనం బయటపడింది. అసలు ఉగ్రవాదులు ఎలా లోనికి వెళ్లారని.. ఈ రాతలను ఎవరు రాసి వుంటారన్న కోణంతో విమానాశ్రయంలో పోలీసులు అణువణువూ అన్వేషిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai airport  terrorists  searching  Threat  ISIS  

Other Articles