Censor board chief leela samson quits govt denies interference

censor board chief leela samson quits, Govt denies interference, Messenger of God, Gurmeet Ram Rahim Singh, Leela Samson, Rajyavardhan Singh Rathore, junior minister in information and broadcasting ministry, interference from government, leela samson must proove,

Amid reports that controversial film “Messenger of God” featuring Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh in lead role has been cleared by Film Certification Appellate Tribunal (FCAT), Censor Board chief Leela Samson tonight said she has decided to resign.

సెన్సార్ బోర్డులో ప్రభుత్వ జోక్యం లేదు, ఆధారాలు చూపించగలరా..?

Posted: 01/16/2015 02:10 PM IST
Censor board chief leela samson quits govt denies interference

డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కీలకపాత్ర పోషించిన వివాదాస్పద చిత్రం 'మెస్సెంజర్ ఆఫ్ గాడ్'కి సెన్సార్ బోర్డు ట్రిబ్యూనల్ సర్టిఫికేషన్ జారీ చేయడంతో సెన్నార్ బోర్డు చైర్ పర్సెన్ లీలా సామ్ సన్ రాజీనామాకు దారి తీసింది. గతంలో ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేసేందుకు బోర్డు నిరాకరించడంతో.. చిత్ర యూనిట్, సినిమా ధ్రువీకరణ అప్పీళ్ల ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. దీంతో మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి ట్రిబ్యూనల్ క్లియరెన్స్ జారీ చేసింది. ఈ చిత్రానికి క్లియరెన్స్ జారీ చేసిన నేపథ్యంలో లీలా శాంసన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకి తెలిపినట్లు ఆమె చెప్పారు.

సినిమాల సర్టిఫికేషన్ విషయాల్లో మంత్రుల జోక్యం చేసుకోవడం నచ్చని కారణంగా లీలా శాంసన్ తన పదవికి రాజీనామా చేశారు. 'మెస్సెంజర్ ఆఫ్ గాడ్' శుక్రవారం రోజు విడుదల కావాల్సి ఉంది. కాగా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. బోర్డు విషయాల్లో మంత్రులు జోక్యం చేసుకోవడం హాస్యాస్పదంగా మారిందని లీలా అన్నారు.  మంత్రిత్వశాఖ నియమించిన ప్యానెల్ సభ్యులు, అధికారుల అవినీతి, జోక్యం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. గత తొమ్మిది నెలలుగా ఒక్క సారి కూడా బోర్డు సమావేశం కాలేదని, ఇందుకు తమ వద్ద నిధులు లేవని మంత్రిత్వశాఖ సమావేశాలకు అనుమతివ్వలేదని లీలా చెప్పారు.

తన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా సెన్సార్ బోర్డులో ఇప్పటికే చైర్ పర్సెన్ సహా సభ్యులందరి కాలపరిమితి ముగిసిందని చెప్పారు. అయినా తాత్కాలిక పొడగింపుల నేపథ్యంలో సభ్యులు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కోత్త చైర్మన్ సభ్యులను నియమించడంలో ప్రస్తుత ప్రభుత్వ విఫలమైందని చెప్పారు.

అయితే సెన్సార్ బోర్డులో కేంద్ర ప్రభుత్వ జోక్యం లేదని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అన్నారు. లీలా శాంసన్ రాజీనామా అమె వ్యక్తిగత విషయమన్నారు. అయితే సెన్సార్ బోర్డులో ప్రభుత్వ ప్రమేయం వుందని అరోపణలు చేస్తున్న లీలా శాంసన్ తన ఆరోపణలను రుజువు చేయాలన్నారు. అయితే రాధోడ్ ఒక్క విషయాన్ని మాత్రం అంగీకరించారు. సెన్సార్ బోర్డు సభ్యుల సహా చైర్మన్ కూడా గత ప్రభుత్వం నియమించిన వారేనని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Messenger of God  Censor Board  chief Leela Samson  officers corruption  

Other Articles