Ready to contest kejriwal actress jayaprada

actor-turned politician, samajwadi party mp, member of parliament, actress Jaya Prada, politician jayaprada, Bharatiya Janata Party, BJP, Delhi assembly elections, delhi Assembly polls, jaya prada to contest in delhi polls, jaya prada to contest in delhi elections, jayapradha to join bjp,

actor-turned politician Jaya Prada is likely to join the Bharatiya Janata Party (BJP) in Delhi ahead of the Assembly polls in the national capital.

బీజేపిలో చేరనున్న జయప్రద.. కెజ్రీవాల్ తో ‘ఢీ’

Posted: 01/15/2015 01:18 PM IST
Ready to contest kejriwal actress jayaprada

సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ, సినీనటి జయప్రద త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆమె త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయప్రద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కూడా కలిసినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం అదేశిస్తే ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ ఎన్నికలలో తన సత్తాను చాటేందుకు కూడా సిద్గంగా వున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
 
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ పై పోటీకి  సిద్ధమన్న జయప్రద వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్ పై మాజీ అప్ నేత షాజియా ఇల్మీని పోటికి దింపనున్నట్లు సమాచారం అందినప్పటికీ.. మైనారిటీలను అమె గత ఎన్నికలలో ఓట్ల అడిగిన విధానం ఢిల్లీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అదే సమయంలో కేజ్రీవాల్ పై పోటీకి నేనున్నానంటూ ముందుకు వచ్చిన జయప్రదను బీజేపి బరిలో దింపనున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం శనివారం ఢిల్లీ వెళ్లనున్న ఆమె బీజేపీ పెద్దలను కలవనున్నారు. ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు...జయప్రదను పార్టీలోకి తీసుకుని, కేజ్రీవాల్ పై పోటీకి నిలబెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కమలం హవా కొనసాగుతున్న నేపథ్యంలో  ఆమె చివరకు బీజేపీ వైపు మొగ్గు చూశారు. ఇప్పటికే నాలుగు పార్టీలు మార్చారన్న విమర్శ తప్ప జయప్రదపై ఇతర వివాదాలు ఏమీ లేకపోవడం కూడా అమెకు కలసివచ్చే అంశాలుగా మారనున్నాయని తెలుస్తుంది.

 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  bjp  aravind kejrival  actor jayaprada  delhi elections  

Other Articles