Rs 12 lakh theft in cineme style

Rs 12 lakh theft in cineme style, diverting persons attention, rs. 10 notes, unidentified persons, 12 lakh rupees, money bag Hotel Business Kondapur suryanarayana reddy, Bag missing, Kakinada, Thief, robber money bag

diverting the persons attentions on to rs 10 notes unidentified persons grab 12 lakh rupees money bag

సినిమా ఫక్కీలో రూ. 12 లక్షలు చోరీ

Posted: 01/15/2015 01:07 PM IST
Rs 12 lakh theft in cineme style

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దొంగలు పట్టపగలు 12 లక్షల రూపాయలను సినీ ఫీక్కీలో చోరీ చేసి జారుకున్నారు. బాధితుడి దృష్టి మరల్చి క్షణాల్లో 12 లక్షల రూపాయలను స్వాహా చేశారు. పది రూపాయల నోట్లు కారు వద్ద చల్లిన దొంగ కారు లోపల ఉన్న క్యాఁష్ బ్యాగ్‌ను పట్టుకుని ఉడాయించాడు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ శాంతినగర్‌కు చెందిన కొండాపు సూర్యనారాయణరెడ్డి హోటల్ వ్యాపారం చేస్తుంటాడు.

అతడు పద్మాలయ గృహమందిర్ యజమానికి రూ.12 లక్షలు ఇవ్వడానికి కాకినాడ మెయిన్ రోడ్డులోని శ్రీనికేతన్ వద్దకు వచ్చాడు. ఈ లోపు ఓ ఆగంతకుడు కారు చుట్టూ రూ.పది కొత్త నోట్లు  చెల్లాచెదురుగా పడేశాడు. అప్పటికీ సూర్యనారాయణరెడ్డి కారు డోరు కూడా తెరవకుండా తాను డ్రైవర్ సీట్‌లో, సొమ్ములు తెచ్చిన బ్యాగును ఆ పక్కసీటులో పెట్టి కూర్చున్నాడు.
 
ఆగంతకుడు ఇంతలో కారు తలుపు తట్టడంతో సూర్యనారాయణరెడ్డి తలుపు తెరిచాడు. అప్పటికే కిందపడేసిన రూ.పది నోట్లు చూపిన ఆగంతకుడు ‘మీ డబ్బులే.. కింద పడిపోయాయి.. తీసుకోండి..’ అన్నాడు.  సూర్యనారాయణరెడ్డి చెల్లాచెదురుగా పడి ఉన్న నోట్లను తీస్తుండగా ఆగంతకుడు కారులోని నగదు బ్యాగ్ కాజేసి పరారయ్యాడు. కిందపడి ఉన్న 12 నోట్లను జేబులో పెట్టుకున్న సూర్యనారాయణరెడ్డి తీరా చూస్తే కారులోని నగదు బ్యాగ్ కనబడలేదు. చుట్టుపక్కల గాలించినా ఆగంతకుడి జాడలేదు.

దీంతో సూర్యనారాయణరెడ్డి టూ టౌన్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూ టౌన్ సీసీఎస్ ఎస్సై ఎం.జానకీరామ్ కేసు నమోదు చేశారు. కాకినాడ క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్, ఎస్‌డీపీఓ సూర్యదేవర వెంకటేశ్వరరావు, టూ టౌన్ ఎస్‌హెచ్‌ఓ డీఎస్ చైతన్యకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 
 ఏమరుపాటు వద్దని ప్రజలకు పోలీసుల వినతి

బ్యాంకులు, ఇతర ప్రాంతాల్లో డబ్బు పట్టుకు వెళ్లే వారి దృష్టిని మళ్లించడానికి దుండగులు రకరకాల ఎత్తులు వేస్తారని, అందుకే ఏమరుపాటుగా ఉండరాదని క్రైం డీఎస్పీ సోమశేఖర్ సూచించారు. పరిచయం లేని వ్యక్తులు మాటకలిపేందుకు ప్రయత్నిస్తే వెంటనే విషయం పసిగట్టాలన్నారు. మహిళల మెడల్లో బంగారు ఆభరణాల చోరీకి కూడా ఇదే కారణమన్నారు.

తమిళనాడు, నగరి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ముఠాలు ఇలాంటి చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నామన్నారు. అనుమానం కలిగేలా ప్రవర్తించే వారి గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వ్యాపారులు అధిక మొత్తంలో ఒంటరిగా సొమ్మును తరలించడం, మహిళలు ఆభరణాలు మెడలో వేసుకుని ఒంటరిగా తిరగడం శ్రేయస్కరం కాదన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles