Lover harrased women via 750 mobile numbers

Lover harrasement, man harrased his lover, 750 mobile numbers, bihar women, womens classmate, last six years, accept him as lover, bihar police, bihar women help line, bihar cyber crime police, women classmate harassment, lover harrased women via 750 mobile numbers, written letter,

A woman in Bihar here has claimed that a man called her from 750 mobile phone numbers in the last six years asking her to accept him as her lover.

750 ఫోన్ నెంబర్లతో యువతికి వేధింపులు

Posted: 01/15/2015 01:10 PM IST
Lover harrased women via 750 mobile numbers

తనను ప్రేమించాలంటూ గత ఆరేళ్లుగా ఫోన్ లో అర్థిస్తున్నాడు. అయినా ఆ మహిళకు అతడిపై కనికరం కలగలేదు. తన ఫోన్ బ్లాక్ అయిన ప్రతీసారి తాను మరో సిమ్ తీసుకుని ఇలా వందల ఫోన్ నెంబర్లు మార్చి, మరీ తనను ప్రేమించాలంటూ మహిళను కోరాడు. ప్రేమికుడి వస్తున్న ఫోన్లతో విసిగి వేసారిపోయిన ఆ యువతి ఎట్టకేలకు మహిళా హెల్ప్ లైన్ ను ఆశ్రయించింది. దీంతో సదరు వన్ వే ప్రేమికుడు తన ప్రేయసి ప్రేమను ఆర్జించేందుకు 750కి పైగా ఫోన్ నెంబర్లను వాడారని తెలిసింది.

వివరాల్లోకి వెళ్లే ఓ యువకుడి తన క్లాస్ మేట్ అయిన యువతిని వలచాడు. అంతేకాదు తనను ప్రేమించమని చెప్పే ధైర్యం లేక అమె ఫోన్ నెంబరును సంపాదించాడు. ఇక అక్కడి నుంచి ప్రతి రోజు ఫోన్ చేసి తనను ప్రేమించాలంటూ తన క్లాస్ మేట్ అయిన యువతికి ఫోన్ చేసేవాడు. అతడి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసినా కొత్త నంబర్ల నుంచి ఫోన్లు చేసేవాడని ఆమె తెలిపింది. బ్లాక్ చేసిన ప్రతిసారీ ఫోన్ నంబర్లు మార్చేసే వాడని వాపోయింది. దీంతో మహిళా హెల్ప్ లైన్ ను ఆశ్రయించడంతో వారు నిందితుడు 750 ఫోన్ నంబర్లు వినియోగించినట్టు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలిందని మహిళా హెల్ప్ లైన్ అధికారి ప్రమీలా కుమారి తెలిపారు.

చివరికి అతడి ఫోన్ నంబర్ కనిపెట్టి, మహిళా హెల్ఫ్ లైన్ కు రావాలని పోలీసులు అదేశించడంతో.. వచ్చిన నిందితుడిని చూసి.. తన క్లాస్ మేట్ అని యువతి నిర్ధారించుకుంది. ఇకపై తాను యువతిని వేధించబోనంటూ సదరు యువకుడు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో అతన్ని పోలీసులు వదిలిపెట్టారు. భవిష్యత్ లో మళ్లీ వేధింపులకు దిగితే చర్య తప్పదని హెచ్చరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar woman  harassment  women helpline  

Other Articles