Naqvi gets one year jail term

mukhtar abbas naqvi, judicial custody to mukhtar abbas naqvi, rampur court imposed judicial custody, Mukhtar Abbas naqvi, bjp, 2009 lok sabha elction, naqvi breached prohibitory orders, naqvi conducted meeting, naqvi 20 others judicial custody, rampur court

A Rampur court on Wednesday pronounced a one-year jail term for Union minister of state for minority affairs Mukhtar Abbas Naqvi for breaching prohibitory orders during the 2009 Lok Sabha polls.

కేంద్ర మంత్రికి జైలు.. వెనువెంటనే బెయిలు..

Posted: 01/14/2015 08:06 PM IST
Naqvi gets one year jail term

కేంద్ర మైనారిటీ శాఖ సహాయ మంత్రి, బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నక్వీకి ఉత్తర్ ప్రదేశ్ కోర్టులో చుక్కెదురైంది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల కమీషన్ నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన కేసులో ఆయను దోషిగా పరిగణించింది న్యాయస్థానం. దీంతో ఆయనకు ఏడాది కాలం పాటు కారగార శిక్ష ను విధించింది. దీంతో కేంద్ర మంత్రి నఖ్వీని పోలీసులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఆయనను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. నఖ్వీతో పాటు మరో 19 మంది నిందితులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో దోషులుగా తేలారు. దీంతో వారందరినీ కూడా పోలీసులు అదుపుతోకి తీసుకుని కస్టడీకి తరలించారు. కాగా కోర్టు బయట నఖ్వీ అనుచరులు నినాదాలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా పట్వాయి పోలీసు స్టేషన్‌ పరిధిలో 2009 లోకసభ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నఖ్వీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని ప్రత్యర్థులు పిర్యాదు చేశారు. దీంతో నఖ్వీ సహా మరో 19 మంది నఖ్వీ అనుచరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2009 లోకసభ ఎన్నికల సందర్భంగా నఖ్వీ బిజెపి కార్యకర్తలతో కలిసి రాంపూర్ లోకసభ స్థానంలోని పట్వాయి ప్రాంతంలో ప్రదర్శన నిర్వహించడంతో కేసు నమోదైంది. ఆ సందర్భంగా నఖ్వీ, మరింత మంది నిషేధాజ్ఞలను ఉల్లంఘించి, పోలీసు స్టేషన్‌లోకి దూసుకెళ్లారని అభియోగం మోపారు. చట్టవ్యతిరేకంగా గుమికూడారనే అభియోగం కింద వారిపై కేసు నడిచింది. తీర్పు వెలువరించిన తర్వాత నఖ్వీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mukhtar abbas naqvi  judicial custody  rampur court  

Other Articles