Army jawans destroyed police station

Namrata Desai, station incharge locked in cabin, 3 pc admitted in hospital, Upnagar police, nasik, brawl, 150 army personnel, jawans attacked a police station, police station attacked in Nashik, senior police officers manhandled, lady police inspector Namrata Desai, army vandalised police station, Deolali Artillery School, Upnagar police station

Fifty-sixty army personnel reportedly ransacked Nashik's 'Upnagar' police station at 2.30 pm on Wednesday.

ఆర్మీ వర్సెస్ పోలీస్.. పోలిస్ స్టేషన్ ధ్వంసం..

Posted: 01/14/2015 08:11 PM IST
Army jawans destroyed police station

ఒకరు దేశాన్ని రక్షించే పనిలో సరిహద్దులో చలి, ఎండ, వానను లెక్క చేయకుండా కర్తవ్య దీక్షలో వుండే జవాన్లు.. మరోకరు దేశంలోని ప్రజల మధ్య శాంతి భద్రతలను కాపాడి ప్రజలను ఐకమత్యంగా వుంచే పనిలో వుండే రక్షక భటులు. ఈ రెండు వర్గాల వారు దేశానికి అవసరం. సమరయోధులు అందించిన స్వాతంత్ర్య ఫలాలను ఆస్వాధించాలంటే.. స్వేఛ్చగా వుండాలంటే.. దేశంలోకి శత్రు సేనలు రాకుండా నిలువరించడం అవసరం. దేశంలో అంతర్గతంగా జరుగుతున్న సంఘవ్యతిరేక శక్తులను ఆటకట్టించి, శాంతిని పరఢవిల్లింప చేయడానికి పోలీసులు కూడా అంతే అవసరం.

సరిహద్దులో వుంటే వారికి, దేశంలో వుండే వీరికి లెంక కుదరకపోతే చాలా పెద్ద ముప్పే వచ్చిపడుతోంది. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు అనేకం దేశంలో జరుగుతున్న వాటిపై చట్టం తన పని తాను చేసుకుపోతూనే వుంది. అయితే ఇదే క్రమంలో తాజాగా నాసిక్ లో జరిగిన ఘటనతో జవాన్ల జోలికి వెళ్లవద్దని పోలీసులకు తెలిసివచ్చింది. జవాన్లతో పెట్టుకున్న పాపానికి.. వారికి వచ్చిన కోపానికి పోలీసులకు నిలువ నీడ కరువైంది. అదెలా అంటారా..? వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాసిక్లోని అప్ నగర్ పోలిస్ స్టేషన్ పోలీసులు తమ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించారు, ఆర్మీ అధికారిపై కేసు నమోదు చేశారు.

అప్ నగర్ లోని పోలిస్ స్టేషన్ పార్కింట్ వద్ద ఆర్మీ అధికారికి.. పోలీసు అధికారి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది క్రమంగా పోలీసులు.. ఆర్మీ అధికారిపై కేసు నమోదు చేసే వరకు దారి తీసింది. ప్రభుత్వ విధులను ఆటంకపర్చినట్లు పోలీసులు అధికారిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు రాత్రంతా అతన్ని పోలిస్ స్టేషన్ లోనే నిర్భందించిన పోలీసులు తెల్లవారు జామును వదిలేసారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు కోపోద్రిక్తులయ్యారు. సుమారు 60 నుంచి 70 మంది ఆర్మీ జవాన్లు పోలిస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. రాళ్లును రువ్వారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పోలిస్ స్టేషన్ లోని ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ముగ్గురు పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Army Jawans  Nasik Police Station  Deolali Artillery School  Upnagar  

Other Articles