Swine flu cases increasing in hyderabad

Swine Flu, Swine Flu in Hyderabad, Swine Flu cases in Hyderabad, Hyderabad Swine Flu, Swine Flu symptoms, Swine Flu deaths, Swine Flu treatment, Hyderabad temperature, Hyderabad weather updates, Telanagna weather, winter temperatures, Delhi weather update, Andhra Pradesh Weather Update

Swine Flu cases increasing in Hyderabad : decreasing temperature giving chance to increase Swine Flu. doctors saying that Swine Flu cases increasing in recent days with low temperatures

హైదరాబాదీలారా జాగ్రత్త !

Posted: 01/14/2015 08:03 AM IST
Swine flu cases increasing in hyderabad

కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్న స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో గత వారం రోజులుగా ఈ కేసులు ఎక్కువ అయ్యాయట. వారంలో నగరంలోని పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20మందికి పైగా స్వైన్ ఫ్లూ కేసులతో చేరినట్లు ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహమ్మారి మళ్లీ పడగవిప్పటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వ్యాధి బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

వ్యాధి మళ్లీ విజృంభించటానికి ప్రధానంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు కారణంగా చెప్తున్నారు. చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వైరస్ పెరిగేందుకు అవకాశం ఏర్పడుతోంది. సాధారణ ఉష్ణోగ్రతల్లో అయితే వైరస్ బ్రతకలేదు. కాని చల్లని వాతావరణంలో అయితే ఈ వైరస్ బ్రతికేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. కొద్ది రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గటంతో వైరస్ విస్తరిస్తున్నట్లు గుర్తించారు. వైరస్ నుంచి తప్పించుకోవాలంటే ప్రజలు తెల్లవారుజామున బయటకు వెళ్లకపోవటమే ఉత్తమంగా చెప్తున్నారు.

నగరంలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కొన్ని సార్లు సింగిల్ డిగ్రీ టెంపరేచర్ కూడా నమోదవుతోంది. బుధవారం ఉదయం హైదరాబాద్ లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. నగరంలో సాధారణంగా 35 నుంచి 37 డిగ్రీలుండే ఉష్ణోగ్రత ఏకంగా పది డిగ్రీలకు పడిపోయిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాది నుంచి వస్తున్న గాలుల నేపథ్యంలో మరో నాలుగు రోజులు ఈ ఇబ్బందులు తప్పవని వాతావరణ శాఖ చెప్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swine Flu  Hyderabad  Winter weather updates  

Other Articles