Charlie hebdo magazine latest edition

Charlie Hebdo attack, Charlie Hebdo magazine, Charlie Hebdo latest edition, Charlie Hebdo new edition, Charlie Hebdo latest photos, Charlie Hebdo latest magazine, Charlie Hebdo muhammed prophet photo, Paris attack, world latest news, Kouachi brothers

Charlie Hebdo magazine latest edition : defiant magazine Charlie Hebdo again prints Muhammad prophet photo on latest edition cover page. Charlie Hebdo employees takes attack as a challange and again prints prophet photo on latest edition. after attack demand increased for new edition

ఇది తెగింపా లేక తెగువనా...?

Posted: 01/14/2015 07:37 AM IST
Charlie hebdo magazine latest edition

గతవారం ప్రపంచాన్ని కుదిపేసిన ప్యారిస్ దాడిని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ప్రజలకు వార్తలు అందించే పత్రికపై దాడి చేసి 13మందిని పాశవికంగా బలితీసుకున్న దుర్ఘటన నీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఈ దాడి నుంచి తేరుకున్న చార్లీ హెబ్దో సిబ్బంది తమ పనులు మొదలు పెట్టారు. ప్రతి బుధవారం విడుదల చేసినట్లుగానే ఇవాళ కూడా కొత్త ఎడిషన్ విడుదల చేశారు. ఎడిటర్ సహా సిబ్బంది మరణం విషయాన్ని పక్కనబెట్టేసి ఎప్పట్లాగే వ్యంగ్య పోస్టుచేశారు.

దాడులకు ఏ మాత్రం బెదరమంటూ.. మరోసారి మహమ్మద్ ప్రవక్త కార్టూన్ ను చార్లీ హెబ్డో ప్రచురించింది. కొత్త ఇష్యూ కవర్ పేజీపై ఎడుస్తున్న మహమ్మద్ ప్రవక్త ఫోటో.., చేతిలో ఐ యామ్ చార్లీ అని రాసి ఉన్న ప్లకార్డును చూపించారు. అలాగే ఫోటోలో చివరన ఆల్ ఈజ్ ఫర్ గీవెన్ అని కామెంట్ రాశారు. అంటే ఈ దాడికి పాల్పడిన వారిని క్షమిస్తున్నట్లు చెప్పారు. మతోన్మాదం తలకెక్కి తీవ్రవాదులుగా మారిన వ్యక్తులు ఇతరులను క్షమించటం ఎప్పుడో మర్చిపోయారు. అలాంటి వ్యక్తులను క్షమిస్తున్నాము అంటే వారెలా అర్థం చేసుకుంటారో.

ఇక గతంలో కంటే ఈ సారి దాదాపు మూడు రెట్లు ఎక్కువగా  మ్యాగజైన్ ను ముద్రించారట. మొదట కేవలం పది లక్షల ఎడిషన్లు మాత్రమే ప్రింట్ చేయాలని భావించినా.., తాజా ఘటన నేపథ్యంలో ఫ్రాన్స్ తో పాటు ప్రపంచ దేశాల్లో పేపర్ కు డిమాండ్ వచ్చింది. దీంతో ముప్పై లక్షల కాపీలు ప్రింట్ చేశారు. గత వారం ప్రవక్త ఫోటో వల్లనే పాశవిక దాడి జరగ్గా.., ఈ సారి ఏ మాత్రం జంకకుండా మరోసారి వ్యంగ్య కార్టూన్ వేయటం అంటే చార్లీ హెబ్డో తెగువను చూపిస్తోందని స్పష్టం అవుతోంది. మరోవైపు తాజా ఫోటోపై తీవ్రవాదులు ఎలా స్పందిస్తారో అని ఉత్కంఠ నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charlie Hebdo  Paris attack  Kouachi brothers  

Other Articles