Shashi tharoor knows about sunanda murderer says subramanian swamy

The ongoing verbal slugfest over the Sunanda Pushkar murder case took another turn on Tuesday with Shashi Tharoor demanding that BJP leader Subramanian Swamy should reveal the identity of the 'killer' to the police.

The ongoing verbal slugfest over the Sunanda Pushkar murder case took another turn on Tuesday with Shashi Tharoor demanding that BJP leader Subramanian Swamy should reveal the identity of the 'killer' to the police.

సునందను చంపిందెవరో ఆయనకు బాగా తెలుసు..

Posted: 01/14/2015 10:32 AM IST
Shashi tharoor knows about sunanda murderer says subramanian swamy

బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మరో బాంబు పేల్చారు. సునందా పుష్కర్ను చంపిందెవరో ఆమె భర్త, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్కు తెలుసని.. ఆయన నోరు విప్పాలని అన్నారు. సునందా పుష్కర్ను శశిథరూర్ చంపారని తాను ఏనాడూ చెప్పలేదని స్వామి గుర్తు చేశారు. ఒక జాతీయ మీడియా లైవ్ షోలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఐపీఎల్ సహా అనేక విషయాలను థరూర్ మరుగుపరుస్తున్నారని ఆరోపించారు. థరూర్ను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారిస్తే మొత్తం విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని సుబ్రమణ్యం స్వామి చెప్పారు.

అయితే అదే షోలో లైవ్ లోకి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్.. మాట్లాడుతూ.. సునంద ఫుష్కర్ హత్యకేసులో హంతకుడికి వివరాలను సుబ్రహ్మణ్య స్వామి పోలీసులకు అందించాలని చెప్పారు. కనీసం హంతకుడు ఎలా వుంటాడన్న వివరాలనైనా అందించాలని విరుచుకుపడ్డారు. తన భార్య హత్య గావించబడిందని, అందులోనూ విషపూరితమైన ఇంజక్షన్ ఇవ్వడంతో మరణించిందని తాము బాధలో వుంటే సుబ్రహ్మణ్య స్వామి అరోఫణలకు అది అంతూ అంటూ లేకుండా పోతున్నాయన్నారు.

సునంద పుష్కర్ అంతర అవయవాల నమూనాలను పరీక్షల నిమిత్తం ఏ దేశం పంపాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) రెండు రోజుల్లో నిర్ణయిస్తుందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు.   సునందది అసహజ మరణమని ఎయిమ్స్ ఆస్పత్రి ఇచ్చిన నివేదిక ఆధారంగా జనవరి 1న ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యకేసుగా నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటుచేశారు.

ఈ కేసులో ప్రాథమిక విచారణ నివేదిక(ఎఫ్‌ఐఆర్)ను నమోదు చేసేందుకు సునంద అంతర అవయవాల నమూనాలను ల్యాబ్లో పరీక్షల నిమిత్తం  అమెరికా లేదా ఇంగ్లండ్‌కు పంపుతామని జనవరి 6న బస్సీ చెప్పారు. అప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేమన్నారు. శశి థరూర్‌ను ఎప్పుడు విచారించాలో సిట్ నిర్ణయిస్తుందని బస్సీ స్పష్టంచేశారు. ఈ కేసు విషయమై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజానిజాలేమిటో త్వర లోనే తెలుస్తాయని ఆయన అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunanda case  BS Bassi  sunanda pushkar  shashi tharoor  sunanda murder  subramanian swamy  

Other Articles