Nris must be allowed to e vote within 8 weeks orders supreme court

Non Resident Indians, NRIs, NRI cast vote from abroad, supreme court of india, NRI to cast e-vote, central government, supreme court orders union government, enable e-voting by NRIs, e-voting, supreme court, indian government

Non Resident Indians or NRIs will soon be able to cast their vote from abroad, without having to fly back to their hometown during elections. The Supreme Court today directed the central government to enable e-voting by NRIs within eight weeks.

ఎన్.ఆర్.ఐ లకు ఈ ఓటింగ్ హక్కు కల్పించాల్సిందే..

Posted: 01/12/2015 05:45 PM IST
Nris must be allowed to e vote within 8 weeks orders supreme court

ప్రవాస భారతీయులకు శుభవార్త. ఉన్నత విద్యా, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న ఎందరో ప్రవాస భారతీయులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం తీపి కబురును అందించింది. ఎన్నికల వేళ తాము ఎంతగానో కష్టించి ఆర్జించిన ధనాన్ని విమాన టిక్కట్లకు వృధా చేయకుండా ఇకపై వారు వున్న చోటు నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్నికేంద్రం కల్పించనుంది. ప్రవాసభారతీయులు వారున్న చోటు నుంచే భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయొచ్చు. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

 ప్రవాస భారతీయులు ఈ-ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అదేశించింది. 8 వారాల్లోగా ఈ-ఓటింగు హక్కును ఎన్నారైలకు అందుబాటులోకి తేవాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. విదేశాల్లో నివాసం ఉంటూ భారతీయ పాస్పోర్టు కలిగి ఉన్నవారికి ఈ-బ్యాలట్ ఇచ్చేందుకు తాము ఇప్పటికే అంగీకరించామని, అవసరమైన చట్టాలను సవరించి దాన్ని అమలులోకి తెస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దాంతో వీలైనంత త్వరగానే ఈ-బ్యాలట్ ఓటింగును అమలుచేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి చెప్పింది. దీంతో ప్రపంచవాప్తంగా పలు దేశాలలో ఉపాధి కోసం వెళ్లిన సుమారు 1.1 కోట్ల మంది ప్రవాస భారతీయులకు ఊరట కలిగినట్లయింది.

ఈ బ్యాలట్ ఎలా..

ఈ విధానంలో ముందుగా ఓ ఖాళీ పోస్టల్ బ్యాలట్ పేపర్ను ఓటర్లకు ఈమెయిల్ చేస్తారు. వాల్లు దాన్ని పూర్తిచేసి, సంబంధిత నియోజకవర్గానికి పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇందులో కొంతవరకు అక్రమాలు, రిగ్గింగ్ లేదా రహస్య ఓటింగు లేకపోవడం లాంటి ఇబ్బందులు లేకపోలేవని ఎన్నికల కమిషన్ తన నివేదికలో్ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : e-voting  nris  supreme court  

Other Articles