Minister gaur meets brave heart girl and congratulate

bhopal brave heart girl, madyaprasesh minister babulal gaur, MP home minister babulal gaur, madhya pradesh brave heart girl, brave herat girl foils dacoity, brave heart girl chases dacoits by sword, minister gaur appreciate brave heart girl, masked-dacoits, foiled, dacoity-bid, brave-heart-girl, Ansal-Pradhan-Enclave

A brave heart girl took out a sword and came out of her room on listening to noises at her house in posh Ansal Pradhan Enclave near Dana Pani restaurant

దొంగలను తరిమిన యువతి.. అభినందించిన హోం మంత్రి..

Posted: 01/08/2015 10:22 PM IST
Minister gaur meets brave heart girl and congratulate

ఆడది అబల కాదు సబల అన్న మాటలను అక్షరాలా నిజం చేసింది ఓ వనిత. తమ ఇంట్లో దొంగతనానికి వచ్చిన అయిదుగురు సాయుధులైన దుండగులను కత్తిపట్టుకొని వెంటాడింది. ఆ యువతి నుంచి తప్పించుకునేందుకు సాయుధ దొంగలు పరుగులు లంకించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్‌ హోం మంత్రి బాబులాల్ గౌర్ వనిత ఇంటికి చేరుకుని అమెను అభినందించారు. యువతులు ఇలానే ధైర్యంగా వుండాలని సూచించారు. దైర్యంతో తన ఇంట్లో దొంగతనాన్ని అడ్డుకున్న యువతిని గ్రామ మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో వున్న అన్సాల్‌ ప్రధాన్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న చరణ్‌ప్రీత్ సింగ్ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు పరీక్ష కోసం చదువుకుంటుండగా దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్లు గమనించింది. దీంతో పై అంతస్థులో ఉన్న ఆమె కత్తిపట్టుకొని కిందకు వస్తూ మరో కత్తి తీసుకొని రమ్మని తండ్రి హర్వీందర్ సింగ్ ధీర్‌ను గట్టిగా పిలిచింది. దీంతో దుండగులు పారిపోయారు. తండ్రి వచ్చేలోపే చరణ్‌ప్రీత్ సింగ్ తల్వార్ పట్టుకొని దుండగుల వెంట పరుగెత్తింది.

యువతి కత్తి పట్టుకుని వెంటపడుతుంటే ఆయుధాలు కలిగి ఉన్న దుండగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎన్ క్లేవ్ వెనకనున్న రైలు పట్టాలపై పడి పరుగులు తీశారు. ఈ సంఘటనపై చరణ్‌ప్రీత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చరణ్‌ప్రీత్ ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. యువతి సాహసాన్ని మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబులాల్ గౌర్ మెచ్చుకున్నారు. గురువారం మంత్రి ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. సాహసవంతులకు అందించే అవార్డుకు చరణ్‌ప్రీత్ సింగ్ పేరును సూచిస్తానని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : masked-dacoits  foiled  dacoity-bid  brave-heart-girl  Ansal-Pradhan-Enclave  

Other Articles