Pay without swiping credit or debit cards

ICICI Bank, ICICI Contactless credit cards, ICICI Contactless debit cards, India, Swipe, NFC Technology, Hyderabad, mumbai, gurgoan, ICICI Contactless cards point of sale, no worry of cards theft, High secured ICICI Contactless cards, icici cash without swiping cards

ICICI Bank has come up with an innovative technique which will enable its customers to pay cash without swiping credit or debit cards.

కదిలిస్తే చాలు.. కాసులు రాల్చే కార్డులు వచ్చేశాయ్..

Posted: 01/08/2015 10:30 PM IST
Pay without swiping credit or debit cards

జేబులో వుండే క్రెడిడ్, డెబిట్ కార్డు క్లోనింగ్ కు గురైందా..? కార్డు పోయిందా..? మీకు తెలియకుండానే మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయా..? అయితే వెంటనే వెళ్లి కాంటాక్టు లెస్ కార్డులను తీసుకోండి. దీంతో భద్రతకు భద్రత.. అదీకాకుండా ఎన్ ఎఫ్ సీ టెక్నాలజీతో రూపొందించిన కారణంగా హై సెక్యూరిటీ మీ సోంతం అయినట్లే. ఈ కార్డులు ఎక్కడ లభిస్తున్నాయనేగా మీ ప్రశ్న. మీ కార్డులు తీసుకుని ఈ అత్యంత్య భద్రత కలిగిన కార్డలను బ్యాంకులు జారీ చేస్తాయా.? ఈ కార్డులు ఏం చేయాలనేగా మీ ప్రశ్న.

అందరికీ కాదు కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే దేశంలో తొలిసారిగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్, డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కోరల్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు,  ఎక్స్‌ప్రెషన్స్ వేవ్ డెబిట్ కార్డులు నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీతో పనిచేస్తాయి ఈ కార్డులను స్వైప్ చేయాల్సిన అవసరం లేదని, కదిలిస్తే చెల్లింపులు జరిగిపోతాయి. ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ వల్ల లావాదేవీలు వేగంగా జరుగడంతో పాటు అత్యంత సురక్షితంగా కూడా ఉంటాయి. ఈ కార్డులను మొదటగా హైదరాబాద్, ముంబై, గుర్గావ్‌లో ఐసిఐసిఐ బ్యాంకు అధికారులు కస్టమర్లకు అందించారు. ఈ కార్డుల కోసం ఈ నగరాల్లో 1,200 పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) మెషీన్లను ఏర్పాటు చేశామని వివరించారు.

ఇతర నగరాల్లో వీటిని మామూలు డెబిట్/క్రెడిట్ కార్డులమాదిరిగానే ఉపయోగించుకోవచ్చని తెలి పారు.  లావాదేవీలు వేగంగా జరగడం, భద్రతకు ఢోకా లేకపోవడం వంటి అంశాల వల్ల చెల్లింపుల పరిశ్రమలో ఈ కాంటాక్ట్‌లెస్ కార్డులు పెను విప్లవం సృష్టించబోతున్నాయని వివరించారు. భారత్‌లో ఇంటర్నెట్, మొబైల్, ట్యాబ్, టచ్ బ్యాంకింగ్‌లను తొలిసారిగా అందించిన ఘనత తమ బ్యాంక్‌దేనని ఆయన గుర్తు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icici bank  banking  money  credit card  debit card  technology  

Other Articles