Oil magnates wife rejects 975 million divorce check

Oil executive Harold Hamm, Sue Ann Arnall, horold divorced sue ann arnali, arnali rejected Hamm divorce cheque, Sue Ann Arnall demands her share in total assets, hamm ordered by court, Hamm offered his ex-wife 974.8 million dollars,

Oil executive Harold Hamm offered his ex-wife a handwritten check for $974.8 million in order to settle their bitter divorce, but Sue Ann Arnall rejected it.

రూ. 6వేల కోట్లను తిరస్కరించిన మాజీ భార్యామణి

Posted: 01/08/2015 10:16 PM IST
Oil magnates wife rejects 975 million divorce check

భర్త ప్రేమ, అప్యాయత, అనురాగాలను కోరుకున్న ఓ భార్యమణి.. తన భర్త ఇష్టం మేరకు విడిపోయింది. అయితే అమెకు భరణం కింద తన భర్త ఇచ్చిన మొత్తాన్ని వద్దనుకుంది. భర్తనే కాదనుకున్న తరువాత భర్త ఇచ్చే డబ్బు మాత్రం ఎందుకనుకుందో ఏమో.. గానీ భర్త ఇచ్చిన చెక్కును తిరిగి పంపించింది. అయితే ఇందులో విచత్రిమేమీటీ అంటే.. భరణం కింద తన భర్త ఇచ్చిన మొత్తం ఎంతో తెలుసా..? అక్షరాల ఆరు వేల కోట్ల రూపాయలు. ఇంత సొమ్ము అప్పనంగా వస్తుంటే.. ఎవరు మాత్రం కాదంటారు. అదీనూ ఊరికే కాదు. భరణం కింత తన భర్తే ఇస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు. అయినా ఆమె మాత్రం వద్దనుకుంది. ఎందుకంటారా..? అక్కడున్న చట్టాల ప్రకారం తనకు రావాల్సిన మొత్తం ఆస్తి 18 బిలియన్ డాలర్లు ఇస్తేనే తీసుకుంటానని తేల్చిచెప్పింది.

అమెరికాలో ఆయిల్ చక్రవర్తిగా పేరున్న హెరాల్డొ హమ్ 26 ఏళ్ల క్రితం సూ యాన్ ఆర్నాల్‌ను వివాహం చేసుకున్నాడు. ఏవో కొన్ని మనస్పర్ధవల్ల గత ఏడాది నవంబర్‌లో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు భరణంగా ఒక బిలియన్ డాలర్లు ఇవ్వాలని కోర్టు తీర్పినిచ్చింది. కోర్టు తీర్పు అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరల పతనం కారణంగా తన ఆస్తి తరిగిందని చెబుతూ, 975 మిలియన్ డాలర్ల చెక్‌ను పంపాడు. దీంతో హెరాల్డొ హమ్ మొత్తం ఆస్తుల్లో తన వాటా కింద 18 బిలియన్ డాలర్లు రావాలంటూ... ఆయన భార్య ఆర్నాల్ ఆ చెక్‌ను వెనక్కి పంపించి మరోసారి కోర్టును ఆశ్రయించనుంది. అమెరికాలోని నార్త్ డకోటాలో బయటపడ్డ అతి పెద్ద ముడి చమురు క్షేత్రం హెరాల్డొ హమ్‌‌ది కావడం విశేషం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ivorce money  oil  harold hamm  Sue Ann Arnall  

Other Articles