Bomb threat to chief minister and cabinet

bomb threat to chief minister and cabinet, Tamilnadu chief minister pannerselvam bomb threat, TN CM paneerselvam bomb threat, threat letter to Ariyalur railway station, bomb blast threat letter, unknoun person threat cm and ministers, tamilnadu cm paneerselvam,

Unknown Person sent letter to Ariyalur railway station master mentioned Bomb will blast in railway track during TN Chief Minister travel.

ITEMVIDEOS: బాంబుదాడి హెచ్చరికలతో సీఎం, మంత్రులకు భద్రత కట్టుదిట్టం..

Posted: 01/07/2015 12:25 PM IST
Bomb threat to chief minister and cabinet

ముఖ్యమంత్రి సహా మంత్రులపై బాంబు దాడులకు తెగబడతామని అజ్ఞాత వ్యక్తి హెచ్చరికలు జారీ చేస్తూ బెదిరింపు లేఖను రావడంతో.. పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సహా మంత్రులందరికీ భద్రతను కట్టుదిట్టం చేశారు. అజ్ఞాత వ్యక్తి రాసిన బెదిరింపు లేఖ అరియలూరు రైల్వే స్టేషన్‌కు రావడంతో దీనిని పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ వేగవంతం చేశారు. అరియలూరు రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఓ లేఖను అక్కడి సిబ్బంది చదివారు. అందులో అరియలూరులోని ప్రధాన వంతెనను పేల్చేస్తామని, మలై కోట్టై ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించి, బోల్తా కొట్టిస్తామని పేర్కొనడంతో అక్కడి సిబ్బంది ఆందోళనలో పడ్డారు.

అదే లేఖలో మరో వైపుగా మంత్రుల్ని వదలి పెట్టమని, సీఎం పన్నీరు సెల్వం సచివాలయూనికి వెళ్లే సమయంలో రాకెట్ లాంఛర్‌తో దాడి చేయబోతున్నామని హెచ్చరించడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ లేఖను అందుకున్న రైల్వే పోలీసులు అరియలూరు, తిరుచ్చి ఎస్పీలకు సమాచారం అందించారు.  ఈ నెల 13, 14 తేదీల్లో తాము అనుకున్నట్టుగా, ముందుగా వేసిన పథకం మేరకు దాడులు జరిగి తీరుతాయని మోహన్ మురళి శంకర్ పేరును లేఖలో రాసి ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు.

ఆ లేఖ తిరుచ్చిలోని రామలింగపురం నుంచి రావడంతో అక్కడ విచారణను వేగవంతం చేశారు. గత నెల ఇదే చిరునామాతో తిరుచ్చి శ్రీరంగం స్టేషన్‌కు ఓ బెదిరింపు లేఖ రావడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ లేఖలను పంపిస్తున్న వ్యక్తి ఒకరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పరుగులు తీస్తున్నాయి. ఆ లేఖలో పేర్కొన్నట్టుగా వంతెన వద్ద, మలై కోట్టై రైలు అరియలూరు మీదుగా వెళ్లే ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చెందిన మంత్రులకు భద్రతను పెంచారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Threat letter  unknown person  ariyalur railway station  

Other Articles