We always knew it was murder says sunanda pushkar s cousin

poison poloniunim, Delhi police commisiioner BS Bassi, Congress, sunandas suspisious death, Delhi Police, Murder, poisoning, Shashi Tharoor, Sunanda Pushkar, sunanda assets, shashi tharoor, sunanda's cousin Ashok kumar, Bjp leader gvl narasimha rao, bjp leader subrahmanya swamy,

Sunanda Pushkar's cousin Ashok Kumar in a statement said that the family always new it was murder. "We always knew that this was a case of murder, this decision was delayed," Kumar told

సునందది హత్యేనని ముందునుంచి తెలుసు..

Posted: 01/06/2015 07:11 PM IST
We always knew it was murder says sunanda pushkar s cousin

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ది ముమ్మాటికీ హత్యేనని తమకు ఎప్పటి నుంచో తెలుసునని అమె సోదరుడు అశోక్ కుమార్ అరోపించారు. తమతో పాటు సునందా కుటుంబసభ్యులందరికీ అమెది హత్యేనని తెలుసునన్నారు. అయితే ఈ విషయంలో హత్యగా నిర్థారణ కావడానికి సమయం పట్టిందని చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు తమ సోదరిది హత్యేనని నిర్ణారణకు వచ్చినందుతకు వారు కృతజ్ఞతలు తెలిపారు. త్వరగా విచారణ చేపట్టి అసలైన నిందితులను అరెస్టు చేయాలని సునంద కుటుంబసభ్యులు కోరుతున్నారు.

న్యాయం జరగకపోతే న్యాయమే బాధపడుతుంది..

కేంద్ర మాజీ మంత్రి సునంద పుష్కర్ హత్య కేసు సాధారణ కేసు కాదని బీజేపి నేత జీవిఎల్ నరసింహా రావు అన్నారు. ఈ కేసు దేశంలోని సెలబ్రిటీకీ సంబంధించనది కావడంతో ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసి పోలీసులు కొలిక్కి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ కేసు చిక్కు ముడులన్ని విడీ పోయి దోషులకు శిక్ష పడాలని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో కూడా దోషులకు త్వరితగతిన న్యాయం జరగకపోతే.. ఇక న్యాయమే బాధపడాల్సి వుస్తుందని నరసింహా రావు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పోలీసులు కేసును త్వరగా పరిష్కరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నిలకడ మీద నిజమే తెలుస్తుంది..

సునందా పుష్కర్ ది ఆత్మహత్య కాదని, హత్యేనని ఢిల్లీ పోలీసు కమీషనర్ బిఎస్ బస్సీ నిర్థారించడంపై బీజేపి నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. సునందది హత్యేనని తనకు ముందునుంచీ తెలుసునన్నారు. ఈ విషయం మృతురాలికి కూడా తెలసునన్నారు. నిజాలను వెల్లడించేందుకు అమె సన్నధం కావడమే అమె పాలిట మృత్యు గంటికలు మ్రోగించిందన్నారు. సునంద హత్యగావించబడిన హోటల్ గదిని కూడా మరోమారు పరిశీలించాలని ఆయన కోరారు. పోలీసులు ఎట్టకేలకు సునందది హత్యగా నిర్థారించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ హత్యలో ధనం కూడా ఇమిడి వుందన్నారు. ఈ కేసులో ఆమె భర్త శశిథరూర్ చెప్పిన మాటలన్నీ అబద్దాలని చెప్పారు.

సునంద ఆస్తులేవీ తీసుకోలేదు..

తన దివంగత భార్య సునందా పుష్కర్ ఆస్తులు వేటినీ తాను తీసుకోలేదని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కేరళ హైకోర్టుకు తెలిపారు. దివంగత భార్య వల్ల వచ్చిన ఆస్తులను వెల్లడించనందుకు లోక్సభకు ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్కు సమాధానంగా ఆయనీ వివరాలు చెప్పారు. అసలు తన భార్య కెనడా పౌరురాలని, అందువల్ల హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆస్తులను తాను పొందే అవకాశమే లేదని శశి థరూర్ అన్నారు. సురేష్ కుమార్ అనే బీజేపీ కార్యకర్త శశి థరూర్ మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే.. అసలు ఇంతవరకు సునందా పుష్కర్ స్థిర, చరాస్తులు ఏవేంటన్నవి ఇంతవరకు అంచనా వేయలేదని, అలాగే ఆమె వారసత్వ హక్కులు ఎవరికి వెళ్తాయన్నది కూడా ఇంతవరకు నిర్ధారించలేదని శశి థరూర్ కేరళ హైకోర్టుకు చెప్పారు. ఆమె జీవించి ఉండకపోవడం వల్ల మాత్రమే ఆమె ఆస్తి వివరాలను ఎక్కడా తాను అఫిడవిట్లో చెప్పలేదు తప్ప.. తనకు ఎలాంటి దురాలోచన లేదని ఆయన అన్నారు. ఆమె భారత పౌరురాలు కాకపోవడం, హిందూ వారసత్వ చట్టం కూడా ఆమెకు వర్తించకపోవడం వంటి విషయాలు గుర్తించాలని థరూర్ అన్నారు. కెనడా పౌరురాలైన ఆమె.. వ్యాపార రీత్యా యూఏఈకి వెళ్లిపోయారని తెలిపారు.

పోలోనియం.. అత్యంత విషపూరితం...

మరో వైపు సునందను చంపడానికి నిందితులు ఉపయోగించిన విషపదార్థం పేరు 'పొలోనియం'. ఈ విషయం ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఉంది. పొలోనియం అనేది అత్యంత విషపూరితమైన రేడియోధార్మిక పదార్థం. దీన్ని క్యూరీ దంపతులు 1898లో కనిపెట్టారు. గతంలో ఎవరికైనా విషపూరిత ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధించాల్సి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించేవారు. ఇంతకుముందు పాలస్తీనా నాయకుడు యాసిర్ అరాఫత్ను, కేజీబీ ఏజెంటు ఒకరిని చంపడానికి కూడా ఇదే పదార్థాన్ని ఉపయోగించారు. ఒకసారి దీన్ని ఇంజెక్ట్ చేస్తే కనుక్కోవడం చాలా కష్టం. పౌడర్ రూపంలో కూడా దీన్ని ఉపయోగించేందుకు అవకాశం ఉంది. సునందా పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు శాంపిళ్లను పరీక్ష కోసం విదేశాలకు కూడా పంపారు. అక్కడే ఆమె శరీరంలోకి పోలోనియం అనే విషపదార్థం వున్నట్లు నిర్థారణ అయ్యింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunanda pushkar  shashi tharoor  sunanda murder  sunanda assets  kerala highcourt  

Other Articles