Cm kcr delhi tour appointment letter pm narendra modi latest news

cm kcr news, pm narendra modi, kcr latest news, modi latest news, narendra modi latest news, cm kcr delhi tour, cm kcr kerala tour, cm kcr latest news, trs leaders, telangana government, trs party leaders

cm kcr delhi tour appointment letter pm narendra modi latest news : when cm kcr visits a marriage ceremony in kerala... then he decided to meet pm narendra modi. But modi has didn't gave him appointment letter.

సీఎం కేసీఆర్’కు మొండిచెయ్యి చూపిన మోడీ..

Posted: 01/06/2015 10:03 AM IST
Cm kcr delhi tour appointment letter pm narendra modi latest news

దేశ ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ సీఎం కేసీఆర్’కు గట్టిగానే షాకిచ్చారని సమాచారం! నిన్నమొన్నటివరకు కేసీఆర్’తో సమావేశాలు జరపడానికి సుముఖత వ్యక్తం చేసిన మోడీ.. ఈసారి ఆయనకు మొండిచెయ్యి చూపారు. మోదీని కలవాలని అనుకున్న కేసీఆర్’కు ప్రధాని అసలు అప్పాయింట్’మెంట్ కూడా ఇవ్వలేదు.

అసలేం జరిగిందంటే.. ఇటీవల ఓ పెళ్లి కోసం కేరళ వెళ్లిన కేసీఆర్.. అక్కడ నుంచి డైరెక్ట్’గా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను చర్చలు జరపాలని అనుకున్నారట! కానీ.. మోడీ మాత్రం ఆయనకు అప్పాయింట్’మెంట్ కూడా ఇవ్వలేదని సమాచారం. దీంతో చేసేదేమీలేక.. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లాలనే ఆలోచనను విరమించుకుని హైదరాబాద్’కి తిరిగి వచ్చేశారు.

అటు - తమ అధినేతకు మోడీ అప్పాయింట్’మెంట్ కూడా ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ నేతలు షాక్’కు గురయ్యారు. ప్లానింగ్ కమిషన్ మార్పులకు సంబంధించి ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ నేత కేసీఆర్’కు మోదీ మంచి ప్రాధాన్యతే ఇచ్చారని సంబరపడిపోయిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు తాజాగా మోడీ వ్యవహరించిన తీరుతో తీవ్ర అసహనానికి గురయ్యారు.

కాగా.. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్, సుపరిపాలన దినం కార్యక్రమాలకు కేసీఆర్ ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో మోదీ అసంతృప్తికి గురయ్యారని.. అందుకే ఆయన సీఎం కేసీఆర్’కు అప్పాయింట్’మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. ఇదిలావుండగా.. ఈ విషయంపై భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ఎవరో కావాలని మోడీకి కేసీఆర్’ను దూరం చేయాలని కుట్రపన్నుతున్నారని, అవి ఫలించవని విమర్శించారు. ఈ పరిణామం ఇంకా ఎన్ని విమర్శలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr  pm narendra modi  trs ministers  

Other Articles