Ysr congress party mla roja controversial comments tdp party muddu krishnama naidu

ysr congress party, tdp party, mla roja news, mla roja hot news, muddu krishnama naidu, tdp party news, chandrababu naidu news, ap cm chandrababu naidu, mla roja news

ysr congress party mla roja controversial comments tdp party muddu krishnama naidu : mla roja fires on muddu krishnama naidu. She said that.. there is no protection for women in babu's tdp ruling party.

‘బాబు’ పాలనలో మహిళలకు రక్షణ లేదు!

Posted: 01/06/2015 11:04 AM IST
Ysr congress party mla roja controversial comments tdp party muddu krishnama naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పరిపాలనలో మహిళలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా తీవ్రంగా విమర్శనాస్త్రాలను సంధించారు. బాబు అండతో తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. ఇటీవల నగరి మున్సిపల్ చైర్’పర్సన్ శాంతిపై జరిగిన దాడి గురించి ప్రస్తావించిన ఆమె.. ఈ విధమైన విమర్శలు గుప్పించారు.

ఈ వ్యవహారంపైనే ఆమె ఇంకా మట్లాడుతూ.. ‘‘బాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. స్మగ్లర్లను తన అధీనంలో వుంచుకున్న ముద్దుకృష్ణమనాయుడు విపక్షానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తూ దిగజారుడు రాజకీయాలను పాల్పడుతున్నారు. సీఎం బాబు అండతోనే అతను ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. గతంలో జాతర సమయంలో కూడా తనపై దాడి జరిగిందని.. ఇప్పుడు మున్సిపల్ చైర్’పర్సన్’పై దాడి చేశారు. ఈ దాడులకు బాబు ఏం సమాధానం చెబుతారు’’ అని ఆమె ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysr congress party  tdp party news  chandrababu naidu  mla roja  muddu krishnama naidu  

Other Articles