చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా.., ప్రతిపక్ష నేతగా ఉన్నా, జగన్ కు మాత్రం సీఎం సీటుపై కోరిక మాత్రం తగ్గలేదు. ఎప్పుడు సమయం వచ్చినా నేను సీఎం అయితే బాగుండు అని సారు కలలు కంటున్నారు. ఎప్పుడెప్పుడు సీఎం అవుతానా అని జ్యోతిష్యులను కూడా సంప్రదిస్తున్నారట. పండితులు కూడా కాస్త పాజిటివ్ గా చెప్పటంతో, గ్రహాలన్నీ తననే అనుగ్రహిస్తున్నాయని ఆనంద పడుతున్నారు. తన సంతోషాన్ని ప్రజలతో పంచుకుంటున్నారు. బాబు గేమ్ రెండు సంవత్సరాల్లో ఓవర్ అవుతుందని జగన్ జోస్యం చెప్తున్నారు.
సోమవారం మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రతిపక్ష నేత, అధికారం ఉందికదా అని బాబు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ద్వజమెత్తారు. అంతేకాకుండా దేవుడు అనుగ్రహిస్తే నాలుగేళ్లు ఉండవచ్చు. కానీ ఈ లోపే సర్కారు కుప్పకూలుతుందని జ్యోతిష్కులు చెప్తున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకు వేసి జగనే సీఎం అయితే చేసే పనేమిటో కూడా చెప్పారు. బాబు చేసే అక్రమాలను బయటకు తీసుకువస్తామన్నారు. బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి అప్పగిస్తామన్నారు. మీ కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, మనవడిగా ముఖ్యమంత్రిని అవుతాను. అందరికి న్యాయం చేస్తాను అని చెప్పాడు. అయితే సారు చేసేది సామాజిక న్యాయమూ, సమ న్యాయమూ అనేది మాత్రం చెప్పలేదు.., బహుశా ఇది జ్యోతిష్కుడు చెప్పలేదేమో.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more