Court drops charges against amit shah in fake encounter killings

BJP President Amit Shah, Court drops charges against Amit Shah, special CBI court discharges cases on Amitshah, Amit shah got relief in sohrabuddin sheikh case, Sohrabuddin Sheikh fake encounter case,

In a major relief to BJP President Amit Shah, a special CBI court on Tuesday discharged him in the case of Sohrabuddin Sheikh fake encounter killing in 2005.

బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట..

Posted: 12/30/2014 06:05 PM IST
Court drops charges against amit shah in fake encounter killings

సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షా పై వచ్చిన అభియోగాలను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. మంగళవారం కేసు విచారణకు వచ్చిన అమిత్ షా.. ముంబై సీబీఐ కోర్టులో హాజరయ్యారు. సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు విచారణ సందర్భంగా.. అప్పటి గుజరాత్ హోం శాఖ మంత్రిగా వున్న అమిత్ షా పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో ఈ కేసు నుంచి అమిత్ షా కు విముక్తి కలగింది.

అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్న సమయంలో గ్యాంగ్ స్టర్ షహాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసు సంచలనం రేపింది. ఆ ఘటన జరిగిన ఐదు సంవత్సరాల అనంతరం 2010 లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇందులో నాటి గుజరాత్ డీజీపీ వంజర, హోం మంత్రి అమిత్ షా సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటి నుంచి బీజేపీ అధ్యక్షుడికి విముక్తి లభించింది. అయితే ఈ కేసులో తన స్థాయిని, పరపతిని ఉపయోగించుకుని అమిత్ షా బయటపడ్డారని సోహ్రబుద్దీన్ సోదరుడు ఆర్ షేక్ మీడియాతో అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  Sohrabuddin fake encounter case  CBI court  

Other Articles