Salman khan agrees to campaign for sri lankan president mahinda rajapaksa upsets tamil parties

sri lanka elections, tamil nadu elections, srilanka president rajapaksa, raja paksa election, rajapakse and salman khan, salman khan in srilanka, salman khan compaign in srilanka

Salman Khan accompanied his Sri Lankan co-star Jacqueline Fernandez It is a very sensitive political issue in Tamil Nadu

సల్మాన్ ఖాన్ పై మండి పడుతున్న తమిళనాడు

Posted: 12/30/2014 06:09 PM IST
Salman khan agrees to campaign for sri lankan president mahinda rajapaksa upsets tamil parties

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ పై తమిళనాడులో కొన్ని వర్గాలు మండి పడుతున్నాయి. ఇప్పటికే త్వరలో జరగబోయే శ్రీలంక అధ్యక్ష ఎన్నికలలో ఆ దేశాధ్యక్షుడు మహీంద్రా రాజపక్సే తరపున సల్మాన్ ఖాన్ ప్రచారం చేయనున్నారు. త్వరలో సల్మాన్ ఖాన్ వెళ్లి రాజపక్సేకి మద్దతుగా ప్రచారం చేయటం పై శ్రీలంకలో ఆ వర్గాల నుండి హార్శాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాని భారత దేశం లో మాత్రం తమిళ నాడు మొత్తం సల్మాన్ ఖాన్ పై అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఈ విషయం పియా తమిళ నాట రాజకీయ పక్షాలన్నీ సలమాన్ ఖాన్ శ్రీలంక లో ప్రచారం చేయటం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక నేవీ సిబ్బంది భారతీయ మత్స్చకారులపై దాడులకు తెగబడుతున్నారని అవన్నీ శ్రీలన్గాన్ ప్రస్తుత అధికార ప్రభుత్వ సారథ్యం లోనే జరుగుతున్నాయని అటువంటి వారి తరపున సల్మాన్ ఖాన్ ప్రచారం ఎలా చేస్తఃరని ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు జరుగుతున్న సమయం సల్మాన్ ఖాన్ రాజపక్సే తరపున ప్రచారం చేయటం తగదని సూచిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ప్రచారం చేస్తే తమిళ ప్రజల మనోభావాలు దెబ్బ తీసినట్లే అని కొన్ని వర్గాలు అంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా సల్మాన్ ఖాన్ భారతీయ మత్స్చ కారుల తరపున ఆలోచించి, ప్రచారం మానుకోవాలని, కొందరు నేతలు సూచిస్తున్నారు. ఇప్పటికే తమిళ నాట సల్మాన్ ఖాన్ నిర్ణయం పై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ ప్రచార వ్యవహారం ఒక వివాదంలా నెలకొనే పరిస్థితి వచ్చింది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sri lanka elections  mahindra rajapaksa  salman khan  

Other Articles