Mea beats all other modi ministries on social media

MEA beats Modi ministries on social media, diplomacy, MEA beats Modi ministries on facebook, Ministry of External Affairs, Narendra Modi, social media, SocialMedia, MEA beats Modi ministries soundcloud, Syed Akbaruddin, MEA beats Modi ministries on Twitter, MEA beats Modi ministries YouTube, MEA minister sushma swaraj

For the past seven months since the Narendra Modi government has been in office, it has laid a laser beam focus on the use social media for reaching out to the man on the street with its policies and achievements.

మోడీ మంత్రివర్గంలో దూసుకుపోతున్న విదేశీ వ్యవహరాలు

Posted: 12/27/2014 10:54 PM IST
Mea beats all other modi ministries on social media

దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు షోషల్ మీడియాను విరివిగా వినియోగించుకోండని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపును భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బాగా వంట పట్టించుకుంది. అందుకే మోడీ మంత్రి మండలిలోని మిగిలిని అన్ని శాఖలను వెనక్కు తోసిరాజని ముందుకు దూసుకుపోతోంది. ప్రధాని మంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టి ఏడు నెలల కావస్తున్న సందర్భంలో ఆయన చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తు ముందుకు వెళ్తోంది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

విదేశీ వ్యవహారాలలో గత ఏడు మాసాలుగా సాధించిన ప్రగతిని విశ్లేషిస్తూ.. ఎప్పటికప్పుడు తాజా అప్ డేట్స్ తో అందరి మన్ననలను పొందుతుంది. మోడీ ప్రభుత్వం చేపట్టిన నూతన విధానాలు, సాధించిన విజయాలను పేర్కొంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మిగతా శాఖల కన్నా మెరుగ్గా.. ప్రమాణాలను పాటిస్తూ ముందుకు కదులుతోంది, మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా సోషల్ మీడియానే దోహదం చేసిందని, దానిని విస్మరించరాదని విషయాలు తెలుసుకున్న విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్.. తన దినసరి కార్యక్రమాలతో నిత్యం ఎంతో బిజీగా వున్నా.. సోషల్ మీడియాను మాత్రం విస్మరించకుండా ఫాలో అవుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MEA  Narendra Modi  social media  Sushma swaraj  

Other Articles