Bjp and trs government to give offical status to their party colours

central and state governments, Offical status to their party colours, BJP government, TRS government food security cards, telangana government, food security cards in pink colour, eetela rajendar, pink green coloured one rupee note, indigo coloured one rupee note

BJP and TRS government to give Offical status to their party colours on currency notes and food security cards

అక్కడ అలా.. ఇక్కడ ఇలా... అంతా ‘మార్క్’ల మయం

Posted: 12/27/2014 10:52 PM IST
Bjp and trs government to give offical status to their party colours

ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పాలకులు వారి మర్కు పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అతిశయోక్తి లేదు. వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలను ప్రభావితం చేసి.. గత ప్రభుత్వాల కంటే తాము ఎంతో మెరుగైన పాలనను అందించామని చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా పథకాలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రభుత్వాలు.. పరోక్షంగా కూడా తమను ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తోంది. అందుకు ప్రభుత్వాలు వారు ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రచురించే ముద్రణలే.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన హయాం నుంచి ఈ తరహా ఫార్ములాలకు పెద్ద ఎత్తున్న ప్రజల్లో ఆదరణ లభించింది. చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో ప్రజలకు అందించిన పచ్చని తోరణాలు, జన్మభూమి టోపీలు విద్యార్థుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షంప చేసాయి. ఆ తరువాత వైఎస్ హయాంలో 108 వాహనం, దానిపై రాజీవ్ గాంధీ బొమ్మను చిత్రీకరించడంతో పాటు వారి పోటోలను కూడా ముద్రించి ప్రజల్లోకి వెళ్లడానికి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రూపాయికి కిలో బియ్యం, పప్పు దినుసులు ఇచ్చేందుకు సరుకుల సంచిపై ఆయన ముద్రణ వేసుకుని ప్రజల్లోకి వెళ్లగలిగారు. ఇంటింటా తన సంచి ఉండేలా చేసుకున్నారు.

ఇఫ్పుడు అదే ఫార్మలాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించనున్నాయి. కేంద్రం కొత్తగా తీసుకువచ్చే రూపాయి నోటుపై అంతకుముందు వున్న ఇండిగో రంగులకు బదులుగా బీజేపీ వర్ణాలను కర్సెన్సీ నోటుకు పులుమనున్నారు. గులాబీ, ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో నోటును ముద్రించనున్నట్టు తెలిపారు. ఇక ఇటు తెలంగాణ విషయానికి వచ్చే సరికి వారి పార్టీ వర్ణమైన గులాబి రంగుతో ఆహారభద్రత కార్డులను ఇవ్వనున్నట్లు తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అంతేగా మరి ఎవరి చేతిలో బెత్తం వుంటే వారే ఉపాధ్యాయులని.. వారు చెప్పనట్లే వినాలని పెద్దలు చెప్పారుగా మరి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  TRS  government  Offical status  party colours  

Other Articles