Vijayawada s foundry unit makes guns for maoists

Vijayawada foundry unit, Vijayawada foundry makes guns for Maoists, autonagar foundry makes guns for Maoists, police raid in vijayawada, police raid in autonagar, large number of cartridges, bullets found, gun-making material found, first gun-making incident in Andhra Pradesh, first gun-making incident in vijayawada, weapon making unit at autonagar, vijayawada autonagar, revolvers, eluru police,

surprise raid on Lakshmi Durga Engineering Works showed up large number of cartridges, bullets and other material involved in gun-making.

బెజవాడలో కలకలం.. ఈ మారణాయుధాలు ఎవరి కోసం..

Posted: 12/27/2014 10:23 PM IST
Vijayawada s foundry unit makes guns for maoists

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక రాజధానిగా వెలుగోంది.. ప్రస్తుత నవ్వాంధ్రలో రాజధాని నగరంగా బాసిల్లనున్న విజయవాడలో ఆయుధాల వ్యవహారం కలకలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. విజయవాడలోని ఆటోనగర్లో ఉన్న లక్ష్మీదుర్గ ఇంజనీరింగ్ వర్క్స్ యజమాని, ఇంజనీరింగ్ విద్యార్థి సహాయంతో కలసి మావోయిస్టులకు మారణాయుధాలు తయారు చేస్తున్నారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. మారణాయుధాల తయారీపై పక్కా సమాచారం అందుకున్న ఏలూరు పోలీసులు అకస్మికంగా దాడి చేశారు.

అక్కడ తుపాకుల కార్ట్రిడ్జిలు, బుల్లెట్లు, మారణాయుధాలకు సంబంధించిన ఇతర పరికరాలు భారీ ఎత్తున పట్టుబడ్డాయి. వారం రోజుల క్రితం నెల్లూరు ప్రాంతానికి చెందిన శరత్రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. అతడు మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారు పట్టుకున్నారు. అతడిని విచారించగా.. విజయవాడలో ఆయుధాల తయారీ వ్యవహారం మొత్తం బయటపడింది. దాంతో ఏలూరు నుంచి ప్రత్యేక బృందాలు విజయవాడ ఆటోనగర్కు వచ్చి, ఇక్కడ తనిఖీ చేయగా ఆయుధాల తయారీ గుట్టు బయటపడింది.

సాధారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి వెనుక బడిన రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆయుధాలను గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తుంటారు. అయితే రాష్ట్రంలో కనివినీ ఎరుగని ఆయుధాల తయారీ కర్మాగారం గురించి తెలుసుకున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మధురానగర్ ప్రాంతంలో రివాల్వర్లకు కావల్సిన స్ప్రింగులు కొనుగోలు చేశారు. అక్కడ విచారించగా, తాము స్ప్రింగులు అమ్మిన విషయం వాస్తవమే గానీ, అవి తుపాకుల కోసమన్నది తెలియదని వ్యాపారులు చెప్పారు. దాంతో ఆటోనగర్లో ఆయుధాలు తయారుచేస్తున్న వ్యాపారులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : weapon making unit  vijayawada autonagar  revolvers  eluru police  

Other Articles