Femen activist snatches vatican christmas baby jesus

femen activist snatches jesus, femen activist steals vatican city jesus, femen activist topless photos, topless femen activist steals jesus, pop christmas prayer, pop francis vatican city message, christmas celebrations in vatican city, christmas celebrations in india

femen activist snatches vatican christmas baby jesus : A FEMEN protester disrupted a nativity scene in St. Peter's Square in Vatican City. The topless activist, who had 'God is a Woman' written on her torso, stole a statue of baby Jesus before the Vatican police could intervene.

ITEMVIDEOS: ప్రభువు ఆమెను క్షమిస్తాడా... లేదా...?

Posted: 12/26/2014 01:03 PM IST
Femen activist snatches vatican christmas baby jesus

పాపులను క్షమించే మంచి గుణం ఏసు ప్రభువుకు ఉందని క్రైస్తవుల నమ్మకం. ఎంత పెద్ద పాపమయినా.., ఆయన ముందు చెప్పకుంటే పరిహారం లభిస్తుందనీ.., తన పవిత్ర రక్తంతో ప్రజల పాపాలను కడిగేస్తాడని మత గ్రంధాలు, భోధనలు చెప్తున్నాయి. ఈ మంచితనం వల్లనే క్రైస్తవ మతంకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా క్రిస్మస్ పండగ రోజున అతి పవిత్రమైన వాటికన్ సిటీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఏకంగా బాల యేసు  ప్రతిమనే ఓ మహిళ ఎత్తుకెళ్ళింది.

క్రైస్తవులు పవిత్రంగా భావించే వాటికన్ సిటీలో క్రిస్మస్ వేడుకల సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమం మద్యలో అర్ధనగ్నంగా ఉన్న ఓ మహిళ వేదికపై ఉన్న బాలయేసు విగ్రహంను ఎత్తుకెళ్లి.., ‘గాడ్ ఈజ్ ఉమెన్ (దేవుడు మగవాడు కాదు, మహిళే)’  అంటూ నినాదాలు చేసింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మహిళను అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు పాల్పడింది ‘ఫెమెనా’ అనే స్ర్తీ హక్కుల కార్యకర్త అని పోలిసులు వెల్లడించారు.

ప్రపంచ క్రైస్తవ మత పెద్ద పోప్ ప్రసంగించే సెయింట్ పీటర్ స్క్వేర్ ఈ ఘటనతో ఉలిక్కి పడింది. సామూహిక ప్రార్థనలు ఒక్కసారిగా నిలిపేసి అంతా ఆశ్చర్యకరంగా, ఆందోళనకరంగా మహిళను గమనించారు. యేసు ప్రభువును ఎత్తుకెళ్ళి అపవిత్ర పని చేసిన కార్యకర్తను ప్రభువు క్షమించడు అని కొందరు అంటుండగా.., ఎంత తప్పు చేసినా అందరూ తన బిడ్డలుగా భావించి కరుణిస్తాడని కొందరు చెప్తున్నారు. ఇంతకీ ప్రభువు ఆమెను క్షమిస్తాడా.. లేదా చూడాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : femen activists  vatican city church  christmas  

Other Articles