Sub inspector dances with bar girl goes viral

Gujarat policeman dance, Gujarat SI dances with bar girl, Gujarat Sub inspector dances with bar girl, Gujarat SI dances on duty with bar girl, Gujarat SI dance with bar girl on duty, Gujarat policeman dance goes viral, Gujarat SI dances with bar girl goes viral, Gujarat SI through notes on bar girl, Gujarat SI dances with bar girl viral on whattapp, Gujarat SI dances with bar girl faces action,

A sub-inspector of Surat police has been caught dancing with a bar girl while being on duty during an event, prompting the department to initiate action against him after a video of his act went viral on Thursday.

ITEMVIDEOS: బార్ డాన్సర్ తో ఎస్ఐ చిందులు.. సోషల్ మీడియాలో హల్ చల్

Posted: 12/26/2014 01:26 PM IST
Sub inspector dances with bar girl goes viral

సభ్య సమాజం ఏమనుకుంటుందన్న విఛక్షణ కోల్పోయిన ఓ పోలీసు అధికారి ఏకంగా బార్ డాన్సర్ నృత్యానికి మైరచిపోయాడు. బార్ డాన్సర్ నృత్యం చేస్తుంటే ముందుగా డబ్బును వెదజల్లిన ఎస్.ఐ ఆ తరువాత అమెతో పాటు పాదం పాదం కలిపాడు. చిందులు వేశాడు. రక్తికట్టించే స్టెపులు అందుకున్నాడు. ఇలాంటి నృత్యాలను అడ్డుకోవాల్సిన చట్టానికి ప్రతినిధిగా వుంటూనే.. అందులోనూ ఆన్ డ్యూటీలో వున్నప్పుడే.. బార్ డాన్సర్ తో స్టెపులు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాస్త అలస్యంగా అయినా గుజారత్ తో జరిగిన ఘటనను .. సోషల్ మీడియాలో వెలుగులోకి తీసుకోచ్చింది. సూరత్ పట్టణ పరిధిలోని దిండి పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ డిసీ సోలంకి, బార్ డాన్సర్ తో కలసి చిందులు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తమ ఎస్ఐ డిసి సోలంకి ఘటనపై దిండి పోలిస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ జేఎం బాలోచ్ స్పందించారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్ డ్యూటీలో వున్న తమ ఎస్ ఐ తన విజ్ఞతను మరచి చిందులు వేయడంపై చర్యలు తప్పవన్నారు. సెప్టెంబర్ 19న విశ్వకర్మ పూజ సందర్భంగా బందోబస్తుకు వెళ్లి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్ఐ సోలంకి అక్కడ బార్ డాన్సర్ తో కలసి చిందులు వేశారని బాలోచ్ తెలిపారు. ఈ విడియోలు తమ దృష్టికి రావడంతో ఇప్పటికే అతనిపై విచారణకు అదేశించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై తనకు పూర్తి నివేధిక అందజేయాలని సూరత్ సిటీ పోలిస్ కమీషనర్ రాఖేశ్ ఆస్థానా అదేశించారని, అయితే ప్రాథమిక నివేదికను సిద్దం చేసినట్లు సూరత్ పోలీసులు తెలిపారు. అయితే ప్రాథమిక నివేధికను కమీషనర్ పరిశీలించిన మీదట అతని భవిష్యత్ ఏంటనేది తేలుతుందని పోలీసులు వర్గాలు తెలిపాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat police  sub inspector  bar dancer  departmental Action  

Other Articles