Hyderabad metro to take the kcr route

kcr, k chandra shekar rao recent decissions, kcr goverment decissions, kcr view on metro route, hyderabad metro route, telangana metro route, kcr metro route

kcr decided to change metro route

తన రూట్ మార్చే ప్రసక్తే లేదంట..!! కెసిఆరా.. మజాకా...!!

Posted: 12/26/2014 01:02 PM IST
Hyderabad metro to take the kcr route

"నేనొకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" ఇది ఒక ప్రముఖ సినిమా లోని డైలాగ్.., తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా సరిగ్గా ఇలానే వ్యవహరిస్తున్నారేమో...!! ఇప్పటికే మెట్రో రూట్ పై  అటు ప్రభుత్వం లో ఇటు ఎల్ & టి  సంస్థ లోనూ తీవ్ర తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మెట్రో రూట్ మార్పు జరగకుండా, యదావిధిగా పనులు పూర్తి అయ్యేందుకు గాను నిర్మాణ సంస్థ ఎల్.అండ్ టి చేసిన ప్రయత్నం విపలం అయింది. ఇప్పటికే నిర్మాణ  పనుల్లో జాప్యం జరుగుతున్నాయి, ఇంకా మళ్ళి మెట్రో రూట్ లో మార్పు అంటే మరింత జాప్యం కావటమే అన్న ఎల్ & టి సంస్థ ప్రతినిధుల మాటలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకిభవించటం లేదు. ఇప్పటికే చాలా సార్లు ప్రయతించిన ఎల్ & టి సంస్థ ప్రతినిధులు ఆ ప్రయత్నాలు చేసి చేసి ఇంకా పాలుపోలేక ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకే ఆ రూట్ మార్పును అనుసరించాలని నిర్ణయించుకుంది.

అయితే ఇటీవల ఐఎఎస్ రిటైర్డ్ అదికారి షీలా బిడే కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసినప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. షీలా బిడే ప్రభుత్వరంగ సంస్థల విబజన కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఆమె కెసిఆర్ ను కలిశారు.అప్పుడే ఆమె మెట్రో రైలు రూట్ మార్పు గురించి కూడా మాట్లాడారు. రూట్ మార్పు వల్ల వ్యయం పెరగడంతో పాటు, కాలహరణ జరుగుతుందని ఆమె అన్నారు.అందుకు సమాధానంగా కెసిఆర్ ఒక కాగితం,పెన్ను తీసుకుని తాను ప్రతిపాదించిన రూట్ మార్పు, అవసరం ,అక్కడ ఉన్న వారసత్వ సంపద ప్రత్యేకతలు వివరించారట.అయితే సీలా బిడే ఎల్.అండ్ టి సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు.ఆ విషయం కెసిఆర్ కు తెలియదట. కాని ఆయన మాత్రం తన వాదననే పూర్తిగా వివరించడంతో షీలా బిడే ఏమీ మాట్లాడకుండా వచ్చేశారని చెబుతున్నారు.ప్రభుత్వంలో ఒక్కోసారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు నిర్ణయం తీసుకుంటే, వందల కోట్ల ఖర్చు అయినా వారు వెనక్కి తగ్గరు. సరిగ్గా ఇప్పుడు మెట్రో రూట్ మార్పు విషయం లో ఇది రుజువైంది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  metro route  L & T metro  

Other Articles