Lambasingi andhra pradesh india delhi temperatures fall down

lambasingi temperature, lambasingi winter latest updates, lambasingi chintapally areas, delhi winter temperature latest updates, delhi fog cold waves, vishakapatnam tourist place, telugu latest news updates

lambasingi andhra pradesh india delhi temperatures fall down : andhra kashmir lambasingi shivers with cold and fog of winter season with 0 degree temperature, winter shows nation wide temperatures fall down majorly in delhi and north states

సూర్యుడే వణుకుతున్నాడు.., ఇక మనుషులు ఎలా ఉంటారు !

Posted: 12/22/2014 07:42 AM IST
Lambasingi andhra pradesh india delhi temperatures fall down

తెలుగు రాష్ట్రాల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఆంధ్రా కాశ్మీర్ గా పేరొందిన విశాఖ జిల్లా లంబసింగిలో అయితే ఉష్ణోగ్రతలు ‘0’ డిగ్రీలకు పడిపోయాయి. ప్రజలు బయటకు రావాలంటే వణుకుతున్నారు. చలిమంటలు వేసుకుంటే తప్ప మంచు తొలగి బయటి ప్రపంచం కన్పించటం లేదు. అటు రోడ్లపై కూడా దట్టంగా మంచు పేరుకుని రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్, వరంగల్ సహా ఇతర ప్రాంతాల్లో వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. సూర్యడు కూడా ఏడు గంటల తర్వాతనే బయటకు వస్తుండటంతో.., ప్రజలు వణుకుతున్నారు. అటు భానుడి కిరణాలు ప్రసరిస్తున్నా.., మధ్యాహ్నం వేళ కూడా చల్లని గాలులు తగులుతున్నాయి.

దేశ వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ సహా ఇతర ఉత్తరాది రాష్ట్రాలు చలితో వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ మార్పులను తట్టుకోలేక ఢిల్లీ సమీపంలో వృద్ధుల మరణాలు కూడా నమోదవుతున్నట్లు మెట్రో కార్పోరేషన్ వెల్లడించింది. అటు దట్టమైన పొగమంచు కమ్మేస్తుండటంతో విమాన రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. పలు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో పక్షం రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lambasingi  delhi temperatures  winter fog cold  

Other Articles