Jabardasth venu attacked case filed accused

jabardasth venu attacked, jabardasth venu cases, jabardasth venu controversy skit, jabardasth cases updates, extra jabardasth latest updates, osmania university, telugu goud community updates, popular famous telugu tv shows, etv telugu programmes, latest telugu news updates

jabardasth venu attacked case filed accused : police filed on case against attackers of venu of jabardasth comedy show participant, police filed case on jabardasth venu for allegedly insulting a community feelings by his skit in show

జబర్దస్త్ వేణుపై దాడి.. వేణుపై కేసు నమోదు

Posted: 12/22/2014 07:18 AM IST
Jabardasth venu attacked case filed accused

జబర్దస్త్ టీవీ షో కమెడియన్ వేణుపై దాడి జరిగింది. ఫిలింనగర్ లో ఉండగా ఆయనపై గౌడ సంఘం కార్యకర్తలు దాడి చేశారు. ఈనెల 18న వేణు నటించిన స్కిట్ లో గౌడ వర్గ మనోభావాలు దెబ్బతినేవిధంగా స్కిట్ చేశారని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారిపై పోలిసులు కేసు నమోదు చేశారు.  కల్లు వృత్తిని, గౌడ కులస్తుల శ్రామిక జీవన విధానాన్ని కించపర్చేలా స్కిట్ ఉందని ఆరోపిస్తూ మూడ్రోజుల క్రితమే పోలిసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్ పై స్పందించిన ఓయూ పోలిసులు వేణుపై ఐపీసీ సెక్షన్లు 323, 506 ప్రకారం కేసుపెట్టారు.

తెలుగు పాపులర్ కామెడి షోగా ఎదిగిన జబర్దస్త్ పై రోజురోజుకూ విమర్శలు పెరుగుతున్నాయి. పోటిని తట్టుకుని ఫస్ట్ ప్లేస్ లో నిలిచేందుకు స్కిట్లలో వల్గారిటీని పెంచుతున్నారన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు ఫ్యామిలి మొత్తం కలిసి చూసే షోగా మంచి పేరుండగా ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. అసభ్య పదాలతో ఎబ్బెట్టుగా ఉండే కామెడిని చూపిస్తున్నారు. ఫలితంగా షోపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. అవే ఇప్పుడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jabardth venu  etv telugu latest  telangana latest updates  

Other Articles