Google own campus hyderabad us uk telangana it development

google own campus, google campus hyderabad, google hyderabad jobs, google latest updates, google jobs in india, software bpo jobs in hyderabad, hyderabad it software companies, telangana it development, kcr on telangana development, telangana latest news updates

google own campus hyderabad us uk telangana it development : internet search engine giant google plans to open own campus in hyderabad after usa uk branches, google plans to start third own branch in world at hyderabad soon discuss with telangana government about royalties, allocations

గూగుల్ క్రెడిట్ చంద్రబాబుదా..? చంద్రశేఖర్ దా..?

Posted: 12/22/2014 08:17 AM IST
Google own campus hyderabad us uk telangana it development

తెలంగాణలో ఐటీ, సాఫ్ట్ వేర్ రంగ అభివృద్ది తగ్గుతోందన్న వారికి ఇదో షాకింగ్ వార్త. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజంగా ఉన్న గూగుల్ త్వరలోనే హైదరాబాద్ కు వస్తోంది. ఇప్పటికే నగరంలో ఆఫ్ క్యాంపస్ ఏర్పాుటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్న దిగ్గజ సంస్థ త్వరలోనే హైదరాబాద్ లో సొంత క్యాంపస్ నడపనుంది. ప్రపంచంలో అమెరికా, బ్రిటన్ తర్వాత గూగుల్ ఏర్పాటుచేసుకుంటున్న సొంత క్యాంపస్ హైదరాబాద్ లోనే కావటం విశేషం. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న ఈ అంశంపై గూగుల్ త్వరలోనే ప్రభుత్వంతో చర్చిచంనుంది.

రాష్ట్ర ఐటీ అభివృద్ధిపై వివరాలు వెల్లడించిన ఐటీ శాఖ కార్యదర్శి త్వరలో హైదరాబాద్ కు గూగుల్ వస్తుందన్నారు. వచ్చే ఏడాది వరకు నగరంలో వైఫై సేవలు విస్తరిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది రాష్ట్రావతరణ దినోత్సవం రోజున టీ హబ్ పేరుతో ఇంక్యూబేటర్ సెంటర్ ప్రారంభిస్తామన్నారు. గూగుల్ హైదరాబాద్ ను ఎంచుకున్నా..., ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో క్యాంపస్ ఉన్నందున దీన్ని పర్మనెంట్ చేసుకునే దిశగా ఇంటర్నెట్ దిగ్గజం ఆలోచన చేస్తోందని చెప్తున్నారు.

ఇక తెలంగాణలో అభివృద్ధి తగ్గుతోందని కొద్దికాలంగా విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు, ఏపీ నేతలకు తెలంగాణ సర్కారు గూగుల్ తో కౌంటర్ ఇవ్వనుంది. ప్రముఖ సంస్థ ప్రపంచంలో మూడవ బ్రాంచ్ తెలంగాణలో ఏర్పాటు చేస్తుందని ప్రచారం చేసుకోనుంది. అయితే ఈ క్రెడిట్ ను టీడీపీ కూడా ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్ లో చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్లే ఇఫ్పుడు గూగుల్ వస్తోందని టీడీపీ చెప్పుకునే అవకాశం ఉంది. ఇద్దరు నేతల్లో ఎవరు ఎక్కువగా ప్రచారం చేసుకుంటారో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google campus  hyderabad software companies  telangana development  

Other Articles